Share News

Viral Video: దర్జాగా పర్సు కొట్టి మరీ.. చివరకు ఎలా తప్పించుకున్నాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 11:22 AM

ఓ యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇంతలో మరో యువకుడు అక్కడికి వస్తాడు. అతను ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన ఆ యువకుడు.. మెల్లగా అతడి ఫ్యాటు వెనుక జేబులోని పర్సును కొట్టేశాడు. అయితే..

Viral Video: దర్జాగా పర్సు కొట్టి మరీ.. చివరకు ఎలా తప్పించుకున్నాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

‘‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’’.. అన్న సినిమా డైలాగ్ చందంగా.. ‘‘కంటెంట్ ఉన్నోడికి సోషల్ మీడియా చాలు’’.. అన్న విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ వివిధ రకాల కంటెంట్‌తో వినూత్న వీడియోలను రూపొందిస్తున్నారు. తద్వారా నెట్టింట ఫేమస్ అవడంతో పాటూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల ప్రాంక్ వీడియోలు తెగ వైరల్ అవడం చూస్తున్నాం. దీంతో అనేక మంది వినూత్నమైన ఐడియాలతో వినూత్న ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దర్జాగా పర్సు కొట్టేసి మరీ ఎంతో తెలివిగా తప్పించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇంతలో మరో యువకుడు అక్కడికి వస్తాడు. అతను ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన ఆ యువకుడు.. మెల్లగా అతడి ఫ్యాటు వెనుక జేబులోని (thief stole the youth purse) పర్సును కొట్టేశాడు. అయితే ఆ పక్కనే ఫుట్‌పాత్‌పై కూర్చున్న వ్యక్తి గమనిస్తు్న్నాడు. అయినా ఆ యువకుడ ధైర్యంగా పర్సు కొట్టేసి, అందులోని డబ్బులను తీసేసుకున్నాడు.

Elephant Viral Video: ఏనుగు లవ్ ప్రపోజ్ ఎప్పుడైనా చూశారా.. పూలు పట్టుకుని ఏం చేసిందో చూడండి..


ఇదంతా రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి చూసి నవ్వుకున్నాడు. అయితే పర్సులోని డబ్బులను తీసుకున్న ఆ యువకుడు.. తర్వాత ఖాళీ పర్సును రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి మీద పడేస్తాడు. ఇంతలో తన పర్సు కొట్టేసిన విషయం తెలుసుకున్న వ్యక్తి.. వెనక్కు తిరిగి చూస్తాడు. అప్పుడు పర్సు మరో వ్యక్తి చేతిలో ఉంటుంది. దొంగతనం చేసిన వ్యక్తి.. చివరకు పర్సును తనపై వేయడం చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. పైగా నీ పర్సు కొట్టేశాడంటూ.. కూర్చున్న వ్యక్తిపై నేరాన్ని నెట్టేస్తాడు. దొంగ చేసిన పనికి షాక్ అయిన ఆ వ్యక్తి.. ‘‘అయ్యో.. నేను కొట్టేయలేదు.. ఇతనే కొట్టేశాడు’’.. అంటూ పర్సును దొంగకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: మరీ ఇంత సిన్సియర్ వాకింగ్ ఏంట్రా బాబోయ్.. రైలు పట్టాలు దాటుతూ కూడా ఈమె నిర్వాకం చూడండి..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇది ప్రాంక్ వీడియో అయినా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువకుడు మామూలు షాక్ ఇవ్వలేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ప్రాంక్ వీడియో చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మైట్రో రైల్లో డోరు వద్ద నిల్చున్న అమ్మాయి.. వెనుకే గమనిస్తున్న యువకుడు.. స్టేషన్ రాగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 11:27 AM