Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:04 PM
ఓ మహిళ వంట గదిలో తన పిల్లల కోసం చపాతీలు చేస్తుంటుంది. గోధుమ పిండి ఉండలను రోల్ చేసి, వాటిని పెనంపై వేడి చేస్తుటుంది. ఇందులో తల్లి ప్రేమ ఏముందీ.. అని అనుకుంటున్నారా.. చపాతీలు చేసే సమయంలో ఆమె చేసిన నిర్వాకం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది..

తల్లి ప్రేమకు సాటి మరేదీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల సంతోషంగా తన సంతోషంగా.. వారి ఆకలి తీరితే తన ఆకలి తీరినట్లే అని అనుకుంటుంది. పిల్లలకు చిన్న కష్టమొచ్చినా తల్లిడిల్లిపోతుంది. తల్లి ప్రేమకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో చేసిన పని చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంట గదిలో తన పిల్లల కోసం (woman making chapatis) చపాతీలు చేస్తుంటుంది. గోధుమ పిండి ఉండలను రోల్ చేసి, వాటిని పెనంపై వేడి చేస్తుటుంది. ఇందులో తల్లి ప్రేమ ఏముందీ.. అని అనుకుంటున్నారా.. చపాతీలు చేసే సమయంలో ఆమె చేసిన నిర్వాకం.. స్వచ్ఛమైన తల్లి ప్రేమను గుర్తు చేస్తోంది.
Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..
తన పిల్లలకు ఎక్కడ చపాతీలు తక్కువ వస్తాయో అనే ఉద్దేశంతో.. ఎక్కడి నుంచో తెచ్చి దాచుకున్న చపాతీలను బయటికి తీసి, వాటిలో కలిపేస్తుంది. ఆ తర్వాత అన్నింటినీ పెనంపై వేడి చేసి సిద్ధం చేస్తుంది. ఇలా పిల్లల కోసం చపాతీలను ఎవరికీ తెలీకుండా తీసుకొచ్చి మరీ అందరి మనసులనూ గెలుచుకుంది. ఈమె చేసిన పని చూసి అంతా భావోద్వేగానికి లోనవుతున్నారు.
Viral Video: దర్జాగా పర్సు కొట్టి మరీ.. చివరకు ఎలా తప్పించుకున్నాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు నిలువుటద్దంలా ఉందీ దృశ్యం’’.. అంటూ కొందరు, ‘‘పిల్లల కోసం చపాతీలను చోరీ చేయడంలో తల్లి ప్రేమ కనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..