Share News

Viral Video: కొంపముంచిన స్నేహితుడు.. వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో.. చివరకు..

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:20 PM

ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై జరిగిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వధూవరులు సోఫాలో కూర్చుని ఉండగా.. బంధువులంతా వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. అయితే ఇంతలో వేదికపై ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు వేదికపైకి వచ్చి..

Viral Video: కొంపముంచిన స్నేహితుడు.. వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో.. చివరకు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రాను రాను వివాహ కార్యక్రమాలు సినిమా తరహా ఘటనలకు నిలయాలుగా మారుతున్నాయి. కొన్నిసార్లు అనుకోకుండా చోటు చేసుకునే ఘటనలతో పెళ్లిళ్లు వైరల్ అవుతుంటే.. మరికొన్నిసార్లు ఏదోటి చేసి నెటిజన్లు ఆకట్టుకోవాలని కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు ఇలాంటి ఘటనలన్నీ కలిసి వీడియోల రూపంలో నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఓ పెళ్లిలో చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వేదికపై జరిగిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వధూవరులు (bride and groom) సోఫాలో కూర్చుని ఉండగా.. బంధువులంతా వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. అయితే ఇంతలో వేదికపై ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు వేదికపైకి వచ్చి.. వధువు చేతిలో కొంత నగదును పెడతాడు. ఆ తర్వాత వరుడి చేతిలో కూడా నగదు పెడతాడు.

Viral Video: వామ్మో.. ఈమె టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుని మరీ..


ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. రష్యన్ అమ్మాయిని ఇంటికి పిలిపించాను.. అంటూ వరుడి చెవిలో చెబుతాడు. ఇది విన్న వధువు.. ‘‘ఎవరా అమ్మాయి’’.. అంటూ వరుడితో వాగ్వాదానికి దిగుతుంది. ‘‘ముందే వేరే అమ్మాయితో తిరుగుతూ.. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్’’.. అంటూ వరడిని నిలదీస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, పెళ్లి సమయంలో గొడవ చేయకు.. అంటూ వరుడు ఎంత సర్దిచెబుతున్నా కూడా వధువు మాత్రం శాంతించదు. ఇలా వధువు సీరియస్ అవడంతో వరుడికి ఏం చేయాలో తెలీక.. చివరకు తలపై చేయి పెట్టుకుని సోఫాలో కూర్చుండిపోతాడు.

Viral Video: పరాయి వ్యక్తితో కారులో వెళ్తున్న భార్య.. బైకుపై వెనుకే వెళ్లిన భర్త.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..


ఇలా ఆ యువకుడు వధూవరుల మధ్య గొడవకు కారణమయ్యాడు. ఇదంతా చూస్తుంటే.. వ్యూస్ కోసం వీరంతా కావాలని ఇలా చేసినట్లు అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వధూవరుల మధ్య గొడవ పెట్టేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘అంతా బాగానే యాక్టింగ్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌‌లు, 4.46 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటకూడదనేది ఇందుకే.. ఇతడికేమైందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 17 , 2025 | 08:20 PM