Rohit-Virat: టార్గెట్ రోహిత్-కోహ్లీ.. కావాలనే ఇరికిస్తున్నారా..
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:21 PM
Ajinkya Rahane: భారత జట్టు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అతడు చేసిన కామెంట్స్ రోహిత్-కోహ్లీని ఉద్దేశించనవేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అజింక్యా రహానె.. ఒకప్పుడు భారత జట్టులో స్టార్‌గా చలామణి అయిన ప్లేయర్. ముఖ్యంగా టెస్టుల్లో ఏళ్ల పాటు బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చాడు. ఛతేశ్వర్ పుజారాతో కలసి ఎన్నో క్లిష్టమైన మ్యాచుల్లో టీమిండియాను ఒడ్డున పడేశాడు. అయితే గత రెండేళ్లుగా అతడు జట్టుకు దూరమయ్యాడు. యువ రక్తం రాక కోసం పాతవారిని సాగనంపింది బోర్డు. దీంతో దేశవాళీల్లో, ఐపీఎల్‌లో ఆడుతూ మళ్లీ సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు రహానె. అలాంటోడు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ రహానె ఏం అన్నాడంటే..
ఒక్క మాట కూడా చెప్పలేదు!
వార్తల్లో నిలవాలని తనను కొందరు సూచించారని.. కానీ తాను అది పట్టించుకోలేదన్నాడు రహానె. తనకు పీఆర్ టీమ్ లేదన్నాడు. ఇన్నాళ్లూ క్రికెట్ మాత్రమే తన పీఆర్ అన్నాడు. కానీ ఇప్పుడు తన ఆలోచనా దృక్పథం మారుతోందని.. న్యూస్‌లో తరచూ కనిపించడం చాలా ముఖ్యమని గ్రహించానన్నాడు. ఒకవేళ మన ఫేస్ కనిపించకపోతే పనైపోయిందని భావించే ప్రమాదం ఉందన్నాడు రహానె. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 తర్వాత తనను టీమ్‌లో నుంచి తీసేసిన విధానం మీదా అతడు సీరియస్ అయ్యాడు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అలా చేయడం తట్టుకోలేకపోయానని తెలిపాడు. పరుగులు చేసినా డ్రాప్ చేయడం బాధేసిందన్నాడు.
కొట్లాడినా దండగే!
టీమ్‌లో నుంచి ఎందుకు తొలగించారని అడిగే మనస్తత్వం తనది కాదన్నాడు రహానె. అయినా అవతలి వాళ్లు వినడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్లతో ఎలా ఫైట్ చేయగలనని వాపోయాడు. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. రోహిత్-కోహ్లీని టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు స్టార్ల పీఆర్ టీమ్స్ హల్‌చల్ చేయడం హాట్ టాపిక్‌గా మారడం తెలిసిందే. ఈ ఇద్దరితో పాటు ఇతర యంగ్ క్రికెటర్లకు కూడా పీఆర్ టీమ్స్ ఉన్నాయి. ఈ తరుణంలో రహానె వీళ్లను లక్ష్యంగా చేసుకొనే పీఆర్ టీమ్స్ కంటే క్రికెటే ముఖ్యమనేలా కామెంట్స్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. తనను టీమ్‌లో నుంచి తీసేయడం, సపోర్ట్‌గా నిలవకపోవడం విషయంలోనూ రోహిత్‌ను టార్గెట్ చేసే తాజా ఇంటర్వ్యూలో అతడు పైవ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
చాంపియన్స్ ట్రోఫీ ఉచితంగా చూసేయండిలా.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి