Virat Kohli: మళ్లీ టాప్‌లోకి కోహ్లీ.. రోహిత్‌కే స్పాట్ పెట్టాడుగా..
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:49 PM
ICC Rankings: తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. చాంపియన్స్ ట్రోఫీతో అతడు రిథమ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్‌పై అద్భుతమైన శతకంతో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చాడు.

చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు వరకు టీమిండియాను ఓ సమస్య వేధిస్తూ వచ్చింది. అదే సీనియర్ల ఫామ్. సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతుండటంతో మెగా టోర్నీలో భారత్ పరిస్థితి ఏంటి? అని అంతా ఆందోళన పడ్డారు. కానీ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవడం, చాంపియన్స్ ట్రోఫీతో కోహ్లీ టచ్‌లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా విరాట్ మునుపటి స్టైల్‌లో పాకిస్థాన్‌పై ఆడిన యాంకర్ ఇన్నింగ్స్, సెంచరీ కొట్టిన తీరు, మ్యాచ్ ముగిసేవరకు క్రీజులో నిలబడిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచుతూ టాప్‌లోకి దూసుకొచ్చాడు కింగ్.
కలిసొచ్చిన సెంచరీ
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తిరిగి టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు. 743 రేటింగ్ పాయింట్లతో అతడు 5వ స్థానంలో నిలిచాడు. పాక్‌పై సెంచరీ అతడికి కలిసొచ్చింది. దీని వల్ల ఒక స్థానం మెరుగవడంతో టాప్-5లోకి దూసుకొచ్చాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కోహ్లీ కంటే ముందు హెన్రిచ్ క్లాసెన్ (749 పాయింట్లు), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు), బాబర్ ఆజం (770)లు నాలుగు, మూడు, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో భారత వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (817 పాయింట్లు) టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు.
దాటేస్తాడా..
ఐదో స్థానంలో ఉన్న కోహ్లీకి థర్డ్ ప్లేస్‌లో ఉన్న రోహిత్‌కు మధ్య పాయింట్లలో ఉన్న వ్యత్యాసం 14 మాత్రమే. విరాట్ ఫామ్‌లోకి వచ్చాడు కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ తదుపరి మ్యాచుల్లో అతడు బాగా ఆడితే రోహిత్‌ను దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. హిట్‌మ్యాన్‌ను అధిగమించినా గిల్ (817 రేటింగ్ పాయింట్లు)ను కోహ్లీ అందుకోవడం కష్టమే అని చెప్పాలి. అయితే ఊహించని రీతిలో చెలరేగడం, నిలకడగా పరుగులు చేయడంలో ముందుండే కింగ్ తలచుకోవాలే గానీ తక్కువ సమయంలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చేస్తాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
టీమిండియాను మార్చేసిన రోహిత్-కోహ్లీ
నేను బతికేది దాని కోసమే: రోహిత్
52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి