Share News

IND vs PAK: నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్న రోహిత్.. పాక్‌కు ఇక కాళరాత్రే

ABN , Publish Date - Feb 22 , 2025 | 07:55 AM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీని తన స్టైల్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పోరులో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్‌తో ఫైట్‌కు సిద్ధమవుతోంది.

IND vs PAK: నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్న రోహిత్.. పాక్‌కు ఇక కాళరాత్రే
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రయాణాన్ని ఊహించిన విధంగా ఘనంగా ఆరంభించింది భారత్. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రోహిత్ సేన అదరగొట్టింది. కొన్ని పొరపాట్లు చేసినా ఓవరాల్‌గా టీమ్ పెర్ఫార్మెన్స్ అదిరిందనే చెప్పాలి. సెమీఫైనల్స్‌లో బెర్త్ కోసం చూస్తున్న మెన్ ఇన్ బ్లూ.. రెండో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ టీమ్స్ మధ్య సండే ఫైట్ జరగనుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్లే చాన్స్ ఉండటంతో మ్యాచ్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు సారథి రోహిత్.


దండయాత్రకు రెడీ!

సరిహద్దులతో పాటు క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌తో ఉన్న వైరం, దీనికి తోడు సెమీస్ వెళ్లేందుకు కీలక మ్యాచ్ కావడంతో రేపటి పోరులో నెగ్గి తీరాలని రోహిత్ శర్మ డిసైడ్ అయ్యాడు. అందుకే నిద్రపోతున్న స్పిన్ సింహాన్ని లేపుతున్నాడట. ఆకలి మీద ఉన్న అతడ్ని దాయాది జట్టుపై ఉసిగొల్పేందుకు సిద్ధమవుతున్నాడట. తొలి మ్యాచ్‌లో ఆడకుండా దాచిన ఆ యోధుడ్ని ఇప్పుడు పాక్‌ పైకి దండయాత్రకు దింపుతున్నాడట. ఆ మొనగాడు మరెవరో కాదు.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని తెలుస్తోంది. భీకర ఫామ్‌లో ఉన్న వరుణ్‌ను పాక్ మీదకు వదిలేందుకు రెడీ అయ్యాడని.. ఇక దాయాదికి కాళరాత్రేనని వినిపిస్తోంది.


భీకర ఫామ్‌!

వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అదరగొట్టడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్.. గత ఏడాది కాలంగా టీ20ల్లో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. రీసెంట్‌గా ఇంగ్లండ్‌తో జరిగిన పొట్టి సిరీస్‌లో ఏకంగా 14 వికెట్లతో దుమ్మురేపాడు. అందుకే పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ప్లేస్‌లో హఠాత్తుగా చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి అతడ్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. దుబాయ్ పిచ్‌ మీద మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేందుకు, పరుగులు కట్టడి చేసేందుకు అవకాశం ఉండటం, వరుణ్ బౌలింగ్ గురించి పాక్ బ్యాటర్లకు ఐడియా లేకపోవడంతో రేపటి మ్యాచ్‌లో అతడ్ని ప్రధాన అస్త్రంగా వాడాలని రోహిత్‌-కోచ్ గంభీర్ భావిస్తున్నారట. ఒకవేళ వరుణ్ గానీ క్లిక్ అయితే పాక్‌ పని ఫినిష్ అనే చెప్పాలి.


ఇవీ చదవండి:

మా దెబ్బ మామూలుగా ఉండదు.. హార్దిక్ వార్నింగ్

రంజీ ట్రోఫీలో 68 ఏళ్లలో తొలిసారి

హాకీలో ఐర్లాండ్‌పై భారత్‌ గెలుపు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 07:55 AM