Share News

IPL 2025: అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలే..

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:46 PM

England: ఓ ఇంగ్లండ్ దిగ్గజం మళ్లీ తన పాత జట్టుతో కలిశాడు. ఇక వచ్చే ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు తప్పేలా లేవు. మరి.. ఎవరా ఆటగాడు? ఏ టీమ్‌తో అతడు ట్రావెల్ చేయనున్నాడో ఇప్పుడు చూద్దాం..

IPL 2025: అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలే..
IPL 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో టాలెంటెడ్ ప్లేయర్లను వరల్డ్ క్రికెట్‌కు అందించింది. సత్తా ఉన్న యువకులకు గోల్డెన్ చాన్స్‌లు ఇచ్చి ఎంకరేజ్ చేసింది. పెద్దగా పరిచయం లేని ఇతర దేశాల ఆటగాళ్లనూ కోటీశ్వరులను చేసింది. డబ్బుతో పాటు పేరు, గుర్తింపు, క్రేజ్ ఇచ్చి ప్రోత్సహించింది. స్టార్ ఆటగాళ్లను డెమీ గాడ్స్‌ను చేసింది. అలా ఐపీఎల్ వల్ల తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న ఓ తోపు ప్లేయర్ మళ్లీ లీగ్‌లోకి వచ్చేస్తున్నాడు. 7 సీజన్ల పాటు క్యాష్ రిచ్ లీగ్‌లో బౌలర్లకు నరకం చూపించినోడు ఇప్పుడు పాత జట్టులోకి కొత్త పాత్రలో ఎంట్రీ ఇస్తున్నాడు. క్లాస్, మాస్ మిక్స్ చేసిన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అలాంటోడు తిరిగి వస్తున్నాడంటే అంతా వణుకుతున్నారు. మరి.. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..


కోచ్‌ రోల్‌లో తొలిసారి..

ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ రాక ఖాయమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టీమ్ మెంటార్‌గా అతడు ఎంపికయ్యాడు. ఐపీఎల్-2025లో మెంటార్ రోల్‌లో ఢిల్లీని నడిపించనున్నాడు పీటర్సన్. హెడ్ కోచ్ హేమంగ్ బదాని, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల రావుతో కలసి ఢిల్లీ గెలుపు కోసం వ్యూహాలు రచించనున్నాడు. ఒకప్పుడు ఆటగాడిగా ఐపీఎల్‌లో దుమ్మురేపిన పీటర్సన్.. ఆ తర్వాత కామెంటేటర్‌గానూ ఆడియెన్స్‌ను అలరించాడు. కానీ కోచింగ్ రోల్‌లో కనిపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. 2014లో తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ జట్టులోకే అతడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరి.. కప్పు కోసం కొట్లాటలో డీసీ టీమ్‌ను అతడు ఏ విధంగా ముందంజలో ఉంచుతాడో చూడాలి.


ఇవీ చదవండి:

రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు

కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్

తాలిబన్ల రాజ్యంలో టపాసుల మోత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2025 | 03:51 PM