Ashutosh-Suryakumar: టీమిండియాలోకి అశుతోష్ శర్మ.. సూర్య హింట్ ఇచ్చేశాడుగా..
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:28 AM
LSG vs DC IPL 2025: ఐపీఎల్-2025 జర్నీని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను ఓడించింది డీసీ. అయితే ఈ గెలుపులో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్‌కు ఇవ్వాల్సిందే. అతడే అశుతోష్ శర్మ.

ఐపీఎల్-2025 రోజురోజుకీ మరింత హీటెక్కిస్తోంది. అన్ని జట్లు నువ్వానేనా అంటూ పోరాడుతుండటంతో మ్యాచులు ఆఖరి ఓవర్ వరకు వెళ్తున్నాయి. నిన్నటి లక్నో సూపర్ జియాంట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అభిమానులను మునివేళ్లపై నిల్చోబెట్టాయి. గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి వరకు పోరాడిన అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చాడు. లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. బౌండరీలు, సిక్సులతో విశాఖ తీరంలో తుఫాన్ సృష్టించాడు. అలాంటి ఈ డీసీ హీరోకు జాక్‌పాట్ తగిలిందని తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
సూర్య ఏమన్నాడంటే..
సంచలన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించిన అశుతోష్‌కు టీమిండియా టికెట్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. అతడి హిట్టింగ్ ఎబిలిటీస్, ఫైటింగ్ స్పిరిట్, ఫియర్‌లెస్ అప్రోచ్‌కు బీసీసీఐ పెద్దలు ఫిదా అయ్యారట. టీ20 టీమ్‌లోకి అశుతోష్ ఎంట్రీ మార్గం సుగమమైందని వినిపిస్తోంది. గత ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన ఈ విధ్వంసక బ్యాటర్.. ఈసారి కూడా అదే ఊపును కొనసాగిస్తుండటంతో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంప్రెస్ అయ్యాడట. దీనికి ఊతం ఇచ్చేలా నిన్నటి మ్యాచ్‌పై అతడో పోస్ట్ పెట్టాడు. పట్టుదల, స్వీయ సామర్థ్యంపై ఉన్న నమ్మకం, పోరాడే తత్వం అద్భుతమని ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు సూర్య భాయ్. నువ్వు సూపర్ అంటూ అశుతోష్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. భారత టీ20 జట్టులోకి ఈ పించ్‌హిట్టర్ ఎంట్రీ ఖాయమని.. సారథి సూర్య కళ్లలో పడ్డాడు కాబట్టి ఇక అతడికి తిరుగులేదని చెబుతున్నారు. మెగా లీగ్ ఆసాంతం ఇలాగే రాణిస్తే సెలెక్టర్లు అతడికి రెడ్ కార్పెట్ పరచడం గ్యారెంటీ అని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి