Dhoni-Ashwin: ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ..
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:11 PM
CSK: పాత మిత్రులు ధోని-అశ్విన్ మళ్లీ కలసి ఆడుతున్నారు. సీఎస్‌కే తరఫున అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ద్వయం కానీ రెచ్చిపోతే ఎల్లో ఆర్మీ ఖాతాలో మరో కప్పు ఖాయమని చెప్పొచ్చు.

మహేంద్ర సింగ్ ధోని-రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా అభిమానులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ఈ జోడీ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ మంచి దోస్తులు. అంతకంటే కూడా వీళ్ల మధ్య గురుశిష్యుల బంధం ఉందని చెప్పొచ్చు. మాహీ సారథ్యంలో భారత జట్టులోకి వచ్చిన అశ్విన్.. అతడితో పాటు కోహ్లీ, అశ్విన్ లాంటి ఇతర సారథులూ అండగా నిలవడంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. అశ్విన్ బౌలింగ్-ధోని కీపింగ్.. ఇది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నప్పుడు ఈ జోడీ అదిరిపోయే ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకుంది. మధ్యలో విడిపోయిన అశ్విన్-ధోని.. ఐపీఎల్ కొత్త ఎడిషన్ కోసం మళ్లీ ఒక్కటయ్యారు.
తిరిగి సొంతగూటికి..
అశ్విన్ తన పాతగూటికి చేరుకున్నాడు. మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌తో జతకట్టాడు. కొత్త సీజన్ కోసం ప్రాక్టీస్‌లో చెమటలు కక్కుతున్నాడు అశ్విన్. ధోని, జడేజా లాంటి పాత సీఎస్‌కే సహచరులతో కలసి దుమ్మురేపాలని అనుకుంటున్నాడు. ఈ తరుణంలో అతడు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. తన 100వ టెస్ట్ నేపథ్యంలో మాహీ చేతుల మీదుగా మెమొంటో అందుకోవాలని భావించానని.. కానీ కుదరలేదన్నాడు.
అతడే ఆహ్వానించాడు
అశ్విన్ పిలిచినా ఆ మ్యాచ్‌కు వచ్చేందుకు ధోనీకి కుదర్లేదట. ఆ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ధర్మశాలకు వచ్చేందుకు మాహీ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అయితే అంతకంటే ధోని తనకు పెద్ద బహుమతి ఇచ్చాడని తాజాగా అశ్విన్ రివీల్ చేశాడు. తిరిగి తనను చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఆహ్వానించాడని స్పష్టం చేశాడు. సీఎస్‌కేకు ఆడే అవకాశం కల్పించిన ధోనీకి అతడు థ్యాంక్స్ చెప్పాడు. దిగ్గజ ఆటగాడు ఇలా చేస్తాడని తాను ఊహించలేదన్నాడు. కాగా, 2008లో చెన్నైతో ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన అశ్విన్.. 2015లో ఆ టీమ్‌ను వీడాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్లకు ఆడాడతను. అయితే రిటైర్మెంట్ తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు లోకల్ బాయ్. దీంతో చెన్నై ఫ్యాన్స్ అతడిపై గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి