Rishabh Pant: టాప్ టీమ్స్‌పై పంత్ టార్గెట్.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:41 AM
LSG: ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు పించ్ హిట్టర్ రిషబ్ పంత్. ప్రాక్టీస్‌లో చెమటలు కక్కుతున్నాడు. ఇదే సమయంలో కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలసి గట్టి ప్లానే వేస్తున్నాడు.

ఐపీఎల్-2025 కోసం అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. దీంతో ప్లేయర్లంతా ఒక్కో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. లక్నో సూపర్ జియాంట్స్ కొత్త సారథి రిషబ్ పంత్ కూడా బిగ్ టార్గెట్‌తోనే వస్తున్నాడు. అసలు.. అతడి లక్ష్యాలు ఏంటి.. కొత్త సీజన్‌లో పంత్ ఏం చేయాలని అనుకుంటున్నాడు.. లక్నో విజయం కంటే కూడా రిషబ్ సాధించాల్సిన ఘనతలు ఏం ఉన్నాయి.. అనేది ఇప్పుడు చూద్దాం..
గూస్‌బంప్స్ స్పీచ్
మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జియాంట్స్‌కు వచ్చేశాడు పంత్. అతడ్ని ఏకంగా రూ.27 కోట్ల ఊహించని ధర చెల్లించి మరీ దక్కించుకుంది ఎల్‌ఎస్‌జీ. దీంతో కప్పు వేటలో టీమ్‌ను ముందంజలో ఉంచే బాధ్యత అతడి మీద ఉంది. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా రాణించడంతో పాటు కెప్టెన్‌గా సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పంత్ గట్టి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి బడా జట్లను అతడు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అతడి తాజా స్పీచ్ ఉదాహరణగా నిలుస్తోంది. అందులో గూస్‌బంప్స్ తెప్పించే విషయాలను సహచరులతో పంచుకున్నాడు పంత్. మనం ఏదైనా సాధించగలమని నమ్మాలన్నాడు.
అంతా మీ చేతుల్లోనే..: పంత్
ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పించాలని చూస్తున్నాం. జట్టులో అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం. అయితే ఇది మేనేజ్‌మెంట్ చేతుల్లో లేదు. ఇది చేయాల్సింది మనమే (ప్లేయర్లమే). ప్రతి ఆటగాడికి మేం అండగా ఉంటాం. వరుస అవకాశాలు ఇస్తాం. సీనియర్లు కూడా వాళ్ల అనుభవాలు మీతో పంచుకుంటారు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజ్‌గా తీసుకుందాం. 100 శాతం ఎఫర్ట్ పెడదాం. టీమ్ కోసం ఏం చేయాలో అది చేద్దాం. మీరంతా తోపులు కాబట్టే ఇక్కడ ఉన్నారు. ఎన్నో మర్చిపోలేని అనుభూతులు, జ్ఞాపకాలను సృష్టిద్దాం.
అది కంపల్సరీ..
బిగ్ టీమ్స్‌తో మ్యాచుల్లో గెలుపే లక్ష్యంగా పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ గట్టి ప్లాన్స్ వేస్తున్నారని వినిపిస్తోంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బడా జట్ల మీద విజయం సాధించడం చాలా అవసరమని భావిస్తున్నారట. అదే ఊపులో ఫైనల్స్‌కు చేరుకొని కప్పు సొంతం చేసుకోవాలనేది ఎల్‌ఎస్‌జీ ప్లాన్ అని సమాచారం. అందుకే టీమ్‌లోని ప్రతి ఆటగాడ్ని అందుకు తగ్గట్లు ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారట. గెలుపు తప్ప వేరేదేదీ అక్కర్లేదు.. ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ముందుకెళ్లేలా పంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
ఐపీఎల్ కెప్టెన్లకు బీసీసీఐ హుకుం
చాంపియన్స్ ట్రోఫీతో రూ.737 కోట్ల నష్టం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి