Share News

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:44 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు అదిరిపోయే న్యూస్. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు.

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే
Shubman Gill

భారత వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనత సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అతడు నంబర్ వన్ పొజిషన్‌లో నిలిచాడు. వన్డే బ్యాటర్ల లిస్ట్‌లో 769 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు గిల్. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం (773 పాయింట్లు)ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు టీమిండియా స్టార్. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ర్యాంకింగ్స్‌లో రఫ్ఫాడించాడు.


టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ రప్పా రప్పా!

హిట్‌మ్యాన్ 761 రేటింగ్ పాయింట్లతో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో నిలిచాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 727 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా హవా నడుస్తోంది. వన్డే క్రికెట్‌లో 119 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. చాంపియన్స్ ట్రోఫీ షురూ అయిన నేపథ్యంలో అటు జట్టుతో పాటు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపడం మెన్ ఇన్ బ్లూకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గిల్ బ్యాక్ టు బ్యాక్ ఫెంటాస్టిక్ నాక్స్ ఆడటం, కెప్టెన్ రోహిత్ శతకం కొట్టడం ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలవడానికి గల కారణాలుగా చెప్పొచ్చు. ఈ కాన్ఫిడెన్స్‌తో మెగా టోర్నీలోనూ వాళ్లు దుమ్మురేపాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే జోరులో మరో ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్: యువరాజ్

దిగొచ్చిన పాక్.. భారత్‌తో అట్లుంటది

కర్రాన్‌ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 03:48 PM