Team India: టీమిండియాపై ఆరున్నర అడుగుల బుల్లెట్.. కమిన్స్ మాస్టర్ స్కెచ్
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:52 PM
Sydney Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా మీదకు ప్రయోగిస్తోంది.
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. సిడ్నీలో భారత్ కథ ముగించాలని చూస్తోంది. డ్రా చేసినా సిరీస్ వాళ్ల సొంతమవుతుంది. కానీ గత కొన్నేళ్లుగా బీజీటీ ట్రోఫీ మీద ఈగ వాలకుండా చూసుకుంటోంది టీమిండియా. వరుస పర్యటనల్లో ఓడిస్తూ సిరీస్ దక్కకుండా అడ్డుపడుతోంది. దీంతో కసి మీద ఉన్న కమిన్స్ సేన సిరీస్ దక్కించుకోవడంతో పాటు భారత్‌ను ఆఖరు దెబ్బ వేయాలని చూస్తోంది. గ్రాండ్ విక్టరీతో తమ సత్తా ఏంటో మళ్లీ చూపించాలని భావిస్తోంది. మళ్లీ తమతో మ్యాచ్ అంటే భయపడేలా చేయాలని పట్టుదలగా ఉంది. అందులో భాగంగానే ఓ ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను మెన్ ఇన్ బ్లూ మీద ప్రయోగిస్తోంది. ఆ ఆయుధంతో భారత బ్యాటర్లను కట్టిపడేయాలని చూస్తోంది. మరి.. ఆ వెపన్ ఏంటి? అది అంత డేంజరా? అనేది ఇప్పుడు చూద్దాం..
గట్టోడ్నే దింపుతున్నారు!
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఘనవిజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్న ఆస్ట్రేలియా.. సిడ్నీ టెస్ట్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతోంది. ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకుండా టీమిండియాను బలంగా కొట్టాలని చూస్తోంది. లైట్ తీసుకుంటే భారత్ ఇచ్చిపడేస్తుందని తెలుసు. అందుకే ఎక్కడా పొరపాటుకు చాన్స్ ఇవ్వకుండా సన్నద్ధం అవుతోంది. పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతోంది. భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. బ్యూ వెబ్‌స్టర్ అనే ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా పైకి ప్రయోగిస్తోంది. రాకాసి బౌన్సర్లు, స్వింగర్లతో వెబ్‌స్టర్‌ను మన మీదకు ఉసిగొల్పుతోంది. అతడు గానీ విరుచుకుపడితే ఇక అంతే సంగతులు అంటున్నారు. వెబ్‌స్టర్ అంత తోపా? అతడి రికార్డులు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
కొడతారా? తడబడతారా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తం విఫలమవుతూ వస్తున్నాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచ్ మార్ష్. దీంతో అతడి ప్లేస్‌లో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, పొడగరి వెబ్‌స్టర్‌ను రీప్లేస్ చేయాలని చూస్తోంది కంగారూ టీమ్. ఈ వెబ్‌స్టర్ మామూలోడేం కాదు. 6 అడుగుల 7 అంగులాల ఈ పొడగరి ప్లేయర్.. బంతి చేతపడితే నిప్పులు చెరుగుతూ బ్యాటర్ల మీదకు విరుచుకుపడతాడు. అదే బ్యాట్ పడితే భారీగా పరుగుల వరద పారిస్తాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 93 మ్యాచుల్లో 5297 పరుగులు చేసిన వెబ్‌స్టర్ పేరు మీద 12 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 148 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. కొత్త బౌలర్లను చూస్తే మన బ్యాటర్లు టెంప్ట్ అయి వికెట్లు ఇచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందునా పొడగరి అయిన వెబ్‌స్టర్ మంచి పేస్‌తో బౌన్సర్లు వేస్తాడు. మరి.. అతడ్ని తట్టుకొని కోహ్లీ, రాహుల్, పంత్, గిల్, జైస్వాల్, నితీష్ లాంటి బ్యాటర్లు ఎలా పరుగులు చేస్తారో చూడాలి. ఒకవేళ అతడి బౌలింగ్‌ను అర్థం చేసుకుంటే మాత్రం జాలి లేకుండా అటాక్ చేస్తారు. ఏం జరుగుతుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.