Champions Trophy 2025: ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. ఈ స్పెషల్ డాక్యుమెంటరీ చూశారా..
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:38 PM
Team India: భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని వివరిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వచ్చేసింది. దీన్ని ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డేల్లో రెండో అతిపెద్ద టోర్నమెంట్ అయిన చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ మొదలవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. ఇదే ఆఖరి చాంపియన్స్ ట్రోఫీ అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటంతో ఈసారి కప్పు ఎగరేసుకుపోవాలని, చరిత్రలో నిలిచిపోవాలని అన్ని జట్లు పట్టుదలతో ఉన్నాయి. అటు అభిమానులు కూడా కొదమసింహాల మధ్య యుద్ధాన్ని చూసేందుకు సై అంటున్నారు. మునివేళ్ల మీద నిల్చోబెట్టే హైటెన్షన్ మ్యాచుల కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. అదేంటో ఇప్పుడు చూద్దాం..
‘భారత్ కా సఫర్’!
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్‌ను తయారు చేశారు. ధోని ఎరా నుంచి ప్రస్తుత రోహిత్ జమానా వరకు ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఆడిన తీరు, ఈ ఎడిషన్ కోసం జట్టు ప్రిపరేషన్, గత జ్ఞాపకాలు.. ఇలా అన్నింటి మిళితంగా దీన్ని రూపొందించారు. ‘భారత్ కా సఫర్’ (భారత జట్టు ప్రయాణం) అనే పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్ని టెలికాస్ట్ చేయనున్న జియోహాట్‌స్టార్‌లోనే ఈ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా బయటకొచ్చింది. ఇందులో చాంపియన్స్ ట్రోఫీ-2013 విన్నింగ్ టీమ్ సభ్యులైన ధోని, కోహ్లీ, రోహిత్, జడేజా, భువనేశ్వర్, రైనా, పాండ్యా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తదితరుల్ని చూడొచ్చు. ఈ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇవీ చదవండి:
చాంపియన్స్ ట్రోఫీ ఉచితంగా చూసేయండిలా..
అబ్బాయిలకు గెలుపు.. అమ్మాయిలకు ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి