Share News

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:03 PM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..
BJP Congress Leaders Clashed

మంచిర్యాల: తెలంగాణ (Telangana)లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు (Graduate MLC Elections) గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ (Polling) ప్రారంభమైంది. కొన్ని చోట్ల ప్రశాంతంగా, మరి కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress)వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతపై స్థానిక ఎస్ఐ చేయి చేసుకున్నారని పేర్కొంటూ కార్యకర్తల ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దూసు కెళ్ళాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాల మద్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా పోలీసు కమిషనర్ శ్రీనివాస్ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు చిన్నారి నమస్కారం..


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ శ్రేణులపై దూసుకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఒక నొక దశలో పరిస్థితి చేజారి ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఓటు హక్కను 69,134 మంది పట్ట భద్రులు, 5,693 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. అధికారులు150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల విధుల్లో 1500 మంది సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్లు కీలకంగా ఉన్నాయి. అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటును వేసేందుకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..

ఈరోజైనా వంశీ నోరు విప్పుతారా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 27 , 2025 | 01:03 PM