Share News

Fraud calls: తస్మాత్‌ జాగ్రత్త.. అలా చేస్తే అస్సలు స్పందించకండి: ఏసీబీ డీజీ

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:42 PM

Fraud calls: సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్తమార్గాలకలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను ఏసీబీ అదికారులం అంటూ భయపెడుతున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీజీ అలర్ట్ చేశారు.

Fraud calls:  తస్మాత్‌ జాగ్రత్త.. అలా చేస్తే అస్సలు స్పందించకండి: ఏసీబీ డీజీ
Fraud calls

హైదరాబాద్: పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు మోసపోతునే ఉన్నారు. సైబర్ కేటుగాళ్ల చేతిలో పడి రూ.లక్షల్లో తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మోసగాళ్ల వలలో చిక్కి భారీగా నష్టపోతున్నారు. కేటుగాళ్ల పట్ల ఎన్ని చర్యలు తీసుకుంటున్న మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో మోసాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ ఎమ్మార్వోకు ఏసీబీ అధికారిని అంటూ ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టాడు. అవినీతికి పాల్పడుతున్నావ్ అంటూ మోసగాడు డబ్బులు డిమాండ్ చేశాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే తాను చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలని బెదిరించాడు. డబ్బులు వేస్తే ఏం పట్టించుకోమని నమ్మబలికాడు. ఎమ్మార్వో భయపడిపోయి కేటుగాడు చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేశాడు. సుమారుగా రూ. 3 లక్షల 30 వేలను ఆన్‌లైన్ ద్వారా ఎమ్మార్వో దామోదర్ బదిలీ చేశారు.


ఏసీబీ డీజీ కీలక సూచనలు..

అయితే, ఏసీబీ పేరుతో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవహారంపై ఏసీబీ డీజీ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే ఏసీబీకి, లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. మీపై కేసు లేకుండా చూస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు.


నకిలీ కాల్స్‌ నమ్మొద్దు..

అలాంటి నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని అన్నారు. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సామాన్యులకు అలాంటి ఫేక్ కాల్స్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్‌1కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని చెప్పారు. ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేమొచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుడు, బాధితుడి పేరు, వివరాలు రహస్యంగా ఉంచుతామని ఏసీబీ డీజీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: రాహుల్‌ మాటే వేదవాక్కు

Yadagirigutta: స్వర్ణ విమాన గోపురానికి ముహూర్తం ఖరారు

Panchayat Elections: ఎన్నికలు లేవు.. నిధులు రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 16 , 2025 | 01:46 PM