Kavitha: కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై కవిత ఫైర్
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:48 PM
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని విమర్శించారు.

ఖమ్మం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో దౌర్బాగ్యమైన పరిస్థితి నెలకొందని... మాజీ సీఎం కేసీఆర్‌పై (Former CM KCR) కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గోదావరి జలాలు కళ్ళముందే పోతున్నా పట్టించుకునే దిక్కులేదన్నారు. బంకచర్ల ప్రాజక్ట్ 190 టీఎంసీ కోసం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) కొట్లాడుతున్నారని.. బంకచర్లకు కేంద్రం అనుమతి ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కనీసం ఈ ఏడాది కాలంలో తట్టెడు మట్టి పోయలేదన్నారు.
ఆ మూడు బిల్లులు పెట్టాల్సిందే..
రాజకీయాల కోసం, అధికారం కోసం కొట్లాడుకుందాం కానీ రైతుల భవిష్యత్తు ఫణంగా పెట్టవద్దని హితవుపలికారు. రాష్ట్ర విభజన సభయంలో ఏడు మండలాలతో పాటు సీలేరు ప్రాజక్ట్ కోల్పోయామన్నారు. ఏపీలో టీడీపీ (TDP), బీజేపీ (BJP) అలయన్స్ నడుస్తోందన్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం అనుమతులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని విమర్శించారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలన్నారు. మూడు బిల్లులు పెట్టకపోతే కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేనట్టే అని అన్నారు. ‘‘మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు’’ అంటూ కవిత వెల్లడించారు.
మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు
తగ్గేదేలే..
కాగా.. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారన్నారు. కొందరిని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా అని ప్రశ్నించారు. రైతుబంధు రాలేదు, భీమా రాలేదు, ఫించన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే అంటూ విరుచుకుపడ్డారు. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదన్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తామని.. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కేసులకు భయపడొద్దని.. ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉందామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News