KTR: అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడింది
ABN , Publish Date - Mar 31 , 2025 | 07:32 PM
KTR:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హెచ్‌సీయూలో ఫుల్ బాల్ ఆడేందుకు వెళ్లి.. ఆ భూములపై ఆయన కన్ను పడిందన్నారు.

హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్తులు అమ్మి.. అప్పులు తేవడమే పనిగా పెట్టుకున్నారనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో హెచ్‌సీయూ విద్యార్థులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూలో చోటు చేసుకొంటున్న పరిణామాలను కేటీఆర్‌కు వారు వివరించారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులకు ఆయన తన మద్దతు ప్రకటించారు.
అనంతరం కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో 45 వేల ఎకరాలు అమ్ముకోబోతున్నప్పుడు.. హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాలు ఎందుకు? అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. హెచ్‌సీయూ వ్యవహారంపై కేంద్రాన్ని రాజ్యసభలో ప్రశ్నిస్తామన్నారు. అవసరమైతే.. ఈ అంశంపై కోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా.. కేంద్రీయ విద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏంటంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. అయితే హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క.. ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఎక్కడో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్‌సీయూ వ్యవహారంపై బీజేపీ, కమ్యూనిస్టులు తమ వైఖరిని చెప్పాలని నిలదీశారు. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఆయనే చెప్పాడని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. హెచ్‌సీయూలో ఫుట్ బాల్ ఆడినప్పుడే రేవంత్ కన్ను భూములపై పడిందని పేర్కొన్నారు.
కోర్టుకు సెలవు దినాలు చూసుకుని.. ప్రభుత్వం ఈ భూములను చదును చేస్తోందని విమర్శిచారు. హెచ్‌సీయూలో కాంగ్రెస్ చేస్తోన్న అరాచకం.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కన్పించటం లేదా? అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. గతంలో హెచ్ సీ యూకు రెండు సార్లు వచ్చిన రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరంటూ నిలదీశారు. ముంబయి, ఛత్తీస్‌గఢ్ అడవులపై మాట్లాడే రాహుల్ గాంధీ.. హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడరంటూ సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉద్యమాన్ని మలినం చేసే మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని అభివర్ణించారు.
విద్యార్థుల ఉద్యమానికి రాజకీయాలను ఆపాదించాలనుకోవటం లేదన్నారు. అందుకు రాజకీయ పార్టీగా తాము క్యాంపస్‌కు పోవటం లేదని తెలిపారు. హెచ్‌సీయూ భారతదేశానికే తలమానికమని పేర్కొన్నారు. సంబంధం లేకున్నా.. హెచ్‌సీయూ భవిష్యత్ కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారని వివరించారు. HCU విద్యార్థుల తెగువ పోరాట స్ఫూర్తి గొప్పదిని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
వందల జేసీబీలతో ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుంది ఆరోపించారు. 2,600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హెచ్‌సీయూ ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాంక్రీటు జంగిల్ మధ్యలో పచ్చదనంతో HCU పశ్చిమ హైదరాబాద్‌కు ఊపరి పోస్తోందన్నారు. అయినా పర్యావరణ పరీక్షలు చేయకుండా 400 ఎకరాలను ఎలా అమ్ముతారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను కేటీఆర్ నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pidakala Samaram: మొదలైన పిడకల సమరం.. ఎక్కడంటే..
Maoists: వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్
Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..
Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..