Share News

Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..

ABN , Publish Date - Jan 03 , 2025 | 10:11 PM

Drinking water supply: భాగ్యనగరంలో 48 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు (HMWSSB) తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..
Hyderabad Drinking water supply

హైదరాబాద్: భాగ్యనగరంలో 48 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు (HMWSSB) తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు చెప్పారు. మంజీర నీటి సరఫరా పథకం ఫేజ్-1లోని కలబ్‌గూర్-లింగంపల్లి స్ట్రెచ్‌లో పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా జనవరి 6వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమై 48 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా పైపులకు భారీ లీకేజీల కారణంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఈ మేరకు ఓ ప్రకటలో తెలిపారు. దాదాపు 48 గంటలపాటు తాగునీరు అందుబాటులో ఉండదని, ఈ విషయాన్ని నగరవాసులు గమనించాలని కోరారు. కాబట్టి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు స్థానికులు సహకరించాలని కోరారు. అలాగే నీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఏరియాల్లో తాగునీటి సరఫరా ఉండదని తెలిపారు. వీటిలో ప్రధానంగా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం, హెచ్‌సీయూ, బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, SBI శిక్షణా కేంద్రం, డోయెన్స్ కాలనీ, హఫీజ్‌పేట, మదీనాగూడ, గంగారాం, చందానగర్, లింగంపల్లి, జ్యోతి నగర్, అశోక్ నగర్, RC పురం పటాన్‌చెరు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉండేవారు మరమ్మతు సమయంలో తమ అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతు పనులు జరుగుతుండటంతో ప్రజలు తగిన సూచనలు పాటించాలని అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటలకు సాధారణ తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.

HYDERABAD-2.jpg


కాగా.. అంతకుముందు డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్‌ల నుంచి రెడ్‌హిల్స్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే 33 అంగుళాల పైప్‌లైన్ దెబ్బతినడంతో ఈ అంతరాయం ఏర్పడింది. రెడ్ హిల్స్, బజార్‌ఘాట్, మల్లేపల్లి, నాంపల్లి, నీలోఫర్ హాస్పిటల్, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ , ఖైరతాబాద్, ఆదర్శనగర్, విజయనగర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. గత 20 రోజుల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటం ఇది రెండోసారి.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 10:17 PM