KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:42 AM
KTR criticizes Congress govt: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీటికి సంబంధించి అంశంపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం నీటిని ఒడిసిపట్టుకోకుండా సముద్రం పాలు చేస్తోందంటూ మండిపడ్డారు.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) మరోసారి విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో పలు అంశాలపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేయడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టలేని అసమర్థ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. యెద్దేచ్ఛగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మరోసారి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే...
‘చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు. నీళ్లన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతోంది’ అంటూ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీజలాల్లో నీటి వాటా తేలకపోవడానికి కారణమని ఆరోపించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వడివడిగా పూర్తి చేసి వందల టీఎంసీలు ఒడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని చెప్పుకొచ్చారు. అయితే కుంగిన కాళేశ్వరం పిల్లర్లను చూపి మరమ్మతులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని కామెంట్స్ చేశారు.
Visakhapatnam: దెబ్బతిన్న అండర్ బ్రిడ్జ్..రైళ్ల రాకపోకలు ఆలస్యం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్దంగా ఉన్నా , నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా టెండర్లు రద్దు చేసి, 15 నెలలుగా పనులను పడావుపెట్టారన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. అన్నం పెట్టే అన్నదాతకు సున్నంపెట్టి. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని.. జాగో తెలంగాణ జాగో అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదిక పోస్టు చేశారు. అంతే కాకుండా #CongressFailedTelangana అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్వీట్‌కు జత చేశారు మాజీ మంత్రి.
ఇవి కూడా చదవండి...
NASA: ఇంటికొస్తున్న సునీతా విలియమ్స్.. వచ్చే టైం ప్రకటించిన నాసా
Land Grabbing: రామచంద్రా.. ఏమిటీ అరాచకం?
Read Latest Telangana News And Telugu News