Share News

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:33 PM

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ వేయగా.. వాయిదా పడింది. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి వీటిని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Supreme Court of India

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Former Minister KTR).. సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు(సోమవారం) జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను జతచేసింది ధర్మాసనం. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి వీటిని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల10న పాత పిటిషన్‌తో కలిపి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.


కాగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్‌‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడంపై సుప్రీం స్పందిస్తూ.. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ సుప్రీం ప్రశ్నించింది.

Sadhineni Yamini: వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత


స్పీకర్‌కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ధర్మాసనం ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

ఈ రాశి వారు బంధుమిత్రులతో సందడిగా గడుపుతారు !

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 12:34 PM