TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:22 PM
TGS RTC MahaLakshmi: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ సిబ్బంది.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే ముందు విధి విధానాలు ఖరారు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారంటీలంటూ తన మేనిఫెస్టోలో పథకాలను పొందు పరిచింది. అందులోభాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని.. దానికి మహాలక్ష్మీ పథకం పేరిట అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇచ్చిన హామీల అమలులో భాగంగా మహాలక్ష్మీ పథకాన్ని.. ఏసీ బస్సుల మినహా అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం విధి విధానాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేయలేదు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం ఇష్టారాజ్యంగా మారిపోయిందంటూ ఆర్టీసీ సిబ్బందే అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విధి నిర్వహణలో పడుతోన్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.
బస్సు ఎక్కిన మహిళలు.. మగవారి సీట్లలో కూర్చోవడం
టికెట్లు తీసుకున్న పురుషులే కాదు.. రూ.1330 చెల్లించి నెల మొత్తానికి బస్సు పాస్ తీసుకున్న వారు సైతం బస్సు ప్రయాణంలో నిల్చోవడం.
పురుషులు ఎక్కారు.. వారి సీట్లలో నుంచి లేవాలంటూ మహిళా కండాక్టర్లు ఆరిచి గోల పెట్టినా ఆ సీట్లలో కూర్చొన్న వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ.. లెగవకపోవడం.
ఇక ఆధార్ కార్డు చూపించి.. బస్సు గమ్యస్థానం వరకు టికెట్ తీసుకొని.. మధ్యలోనే మహిళలు దిగిపోతున్నారని కండాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు గమ్యస్థానం చేరుకునే సరికి... టికెట్ తీసుకున్న మహిళాలు బస్సులో లేకపోవడంతో.. బస్టాండ్‌ల్లోని కంట్రోలర్లు వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోలేక.. తాము పడుతోన్న వేదన అంతా ఇంతా కాదని వారు వాపోతున్నారు. అంతే కాదు.. తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ కండాక్టర్లు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నారు.
ఇక చిల్లర సమస్య..
నగరంలో ముఖ్యంగా సీటి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులంతా దాదాపుగా బస్సు పాస్‌లు కొనుగోలు చేసుకొని ప్రయాణిస్తారు. ఇక మహిళలు ఉచిత ప్రయాణం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వైద్యం కోసం భాగ్య నగరానికి తరలి వచ్చే ప్రయాణికులు సిటీ బస్సు ఎక్కి రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు ఇస్తే..వాటికి టికెట్‌కు సరిపడా తీసుకొని.. మిగిలిన నగదు తిరిగి ప్రయాణికుడికి ఇచ్చే పరిస్థితి సిటీ బస్సుల్లో ఉండడం లేదు. దీంతో బస్సు కండాక్టర్‌కి, ప్రయాణికుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకొంటుంది.
ఈ నేపథ్యంలో పలువురు కండాక్టర్లు విసుగుతో ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఇరువురి మధ్య తగువులాట ప్రారంభమవుతోంది. ఇలా చెప్పుకొంటూ పోతే.. పలు ఇబ్బందులు తాము స్వయంగా అనుభవిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది.. తన ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు.
అంతేకాదు.. ఏదైనా పథకాలు ప్రజా ప్రయోజనార్థం అమలు చేయాలంటే.. ముందుగా విధి విధనాలు ఖరారు చేసి.. ఆ తర్వాత వాటిని అమలు చేయాలని.. అంతేకానీ.. ఓ పద్దతి పాడు లేకుండా.. ఈ తరహా పథకాలను ఇలా.. ఈ విధంగా అమలు పరిస్థిస్తే.. అసలుకే మోసం వస్తుందని ఆర్టీసీ సిబ్బందే కాదు.. ప్రయాణికులు సైతం ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
For Telangna News And Telugu News