Hyderabad: బాబోయ్.. హైదరాబాద్లో షాకింగ్ ఘటన
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:05 PM
Goshamahal Nala Collapse: గోషామహల్ చాక్నవాడిలో ఓ నాలా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలియడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కుంగిపోయిన నాలాను అధికారులు పరిశీలించారు.

హైదరాబాద్: బాబోయ్.. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నిన్న(శనివారం) రాత్రి చాక్నవాడి నాలా కుప్పకూలింది. గత మూడేళ్లలో ఆరోసారి నాలా కుప్పకూలింది. చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు వెళ్లిపోయిన తర్వాత నాలా కూలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కార్మికులు పనిచేస్తున్న సమయంలో నాలా కూలి ఉంటే కార్మికుల ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. నాలా తరచూ కూలుతుండటంతో భయాందోళనలో స్థానికులు బిక్కు బిక్కుమంటున్నారు. అతి పురాతన నాలా కావడంతో నాలా పై కప్పు తరుచూ కూలుతుంది. కూలిన ప్రతిసారి అక్కడి వరకే మరమ్మతు పనులను అధికారులు చేయిస్తున్నారు. పురాతన నాలా కావడంతో నాలా మొత్తం పునర్నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: రాహుల్ మాటే వేదవాక్కు
Yadagirigutta: స్వర్ణ విమాన గోపురానికి ముహూర్తం ఖరారు
Panchayat Elections: ఎన్నికలు లేవు.. నిధులు రావు
Read Latest Telangana News And Telugu News