Share News

BRS: ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:59 AM

పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని హరీష్‌రావు అన్నారు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బీఆర్ఎస్ విజయమని ఆయన అన్నారు.

BRS: ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

హైదరాబాద్: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం (Congress Govt.) నిరుపేదల (Poor People) గురించి ఆలోచించదా.. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమని మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటామని, నిలదీస్తూనే ఉంటామని హరీష్‌రావు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ


పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, పత్రికా సమావేశం నిర్వహించి నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని హరీష్‌రావు అన్నారు. కుల గణన దరఖాస్తులతోపాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బీఆర్ఎస్ విజయమని ఆయన అన్నారు. ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నామన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పొందేందుకు వీలుగా ఆదాయ, భూ పరిమితి నిబంధనల్లో మార్పులు చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 60 వేలు, పట్టణాల్లో రూ. 75 వేలు ఉంటే, దాన్ని గ్రామాల్లో రూ. లక్షా 50 వేలకు, పట్టణాల్లో రూ. 2.50 లక్షలకు పెంచారన్నారు. మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట 5 ఎకరాలుగా ఉన్న పరిమితిని మాగాణి మూడున్నరకు, మెట్ట ఏడున్నర ఎకరాలకు పెంచారని చెప్పారు. దీనివల్ల లక్షల మంది నిరుపేదలకు రేషన్ కార్డు పొందే అర్హతను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందన్నారు.


పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు. తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్పాదాయ వర్గాలు, పేదలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నామన్నారు. పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా కూలీ ఎక్కడైనా నిరుపేదేనని, కాబట్టి పల్లెలు పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని, 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింకు చేయకుండా అర్హులైన అందరికీ వర్తింప చేయాలని కోరుతున్నామన్నారు. నిరుపేదలకు ఆసరాగా ఉండే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ప్రభుత్వం కోతలు విధించడం సరికాదని హరీష్‌రావు హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మనసులో మాట చెప్పిన రఘురామ..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..

శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 19 , 2025 | 09:59 AM