Gutha Sukhender Reddy:రేవంత్ ప్రభుత్వ పనితీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:35 PM
Gutha Sukhender Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సేద్యయోగ్యమైన భూములకే పెట్టుబడి సహాయం ఇవ్వాలని తాను కూడా సూచించానని అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు రైతుబంధు తొలగించాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెట్టుబడి సహాయం పెంచడానికి ధైర్యం కావాలని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వడం మంచి నిర్ణయమని అన్నారు. తనకు ఫార్ములా రేసుల గురించి ఎలా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమైందని తెలిపారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నామని ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి విషయంలో బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. జైపాల్ రెడ్డి పేరు పెట్టడానికి కొందరు వ్యతిరేకించడం సరైంది కాదని చెప్పారు. నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాలు ఇప్పటిదాక లేవు అని తెలిపారు. సేద్యయోగ్యమైన భూములకే పెట్టుబడి సహాయం ఇవ్వాలని తాను కూడా సూచించానని అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు రైతుబంధు తొలగించాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు. అసెంబ్లీకి రావడం రాకపోవడం కేసీఆర్ ఇష్టమన్నారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్న వాళ్లే ప్రభుత్వానికి గ్రిప్ రాలేదు అంటున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలపై కమిషన్లు వేసి ఆరు నెలలే అయింది. అప్పుడే రిజల్ట్ ఎలా వస్తుందని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. టీటీడీ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్స్ అనుమతించినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రభుత్వం ఆపిన ప్రక్రియను కొత్త ప్రభుత్వం అనుమతివ్వడం అభినందనీయమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.