Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Jan 20 , 2025 | 08:22 AM

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణరావు ఇద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించనున్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Phone Tapping Case

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం (Key Development) చోటు చేసుకుంది. అమెరికాలో తల దాచుకున్న తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakararao), శ్రవణరావు 9Sravana Rao) ఇద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించనున్నారు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్‌కు అమెరికాకు మధ్య ఒప్పందం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా సీఐడీ అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. విదేశీ వ్యవహారాల శాఖ నుండి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్ళనుంది. ప్రభాకర్ రావు, శ్రవణరావులను తిరిగి దేశానికి రప్పించడానికి పోలీసులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందారు. మరోవైపు శ్రవణరావు వీసా గడువు ముగిసిన అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుకు కసరత్తు చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ఆ మరుసటిరోజే డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావు మార్చి 11నే అమెరికాకు వెళ్లారు. అక్కడ అరోరాలో ఉంటున్నారు. శ్రవణ్‌రావు మార్చి 20న అమెరికా వెళ్లారు. ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో ఉంటున్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల కుటుంబసభ్యులను విచారించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు న్యాయస్థానంలో వేర్వేరుగా మెమోలు దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు గతేడాది జూన్‌లోనే వస్తానని పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, వైద్యచికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్నట్లు వివరించారు.


మరోవైపు ఆసుపత్రిలో ఉన్న తన సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్‌రావు తన మెమోలో పేర్కొన్నారు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారిద్దరి వీసా గడువు ముగిసిపోయింది. పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి దరఖాస్తు చేయలేదని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు అమెరికాలోనే గ్రీన్‌కార్డు పొందినట్లు తర్వాత వెల్లడైంది. పోలీసులు మాత్రం తమకు అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. శ్రవణ్‌రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరినీ హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్తున్నారు. తాజాగా ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు

అమ్మాయిల విజయంలో తెలుగోడు

ఎవరీ హిమాని?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 20 , 2025 | 08:22 AM