Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:42 AM
Danam Nagender: ఇటీవల కాలంలో ఖైరతాబాద్‌లో అక్రమనిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తుండగా దానం అడ్డుకుని హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అధికారులకు మాస్ వార్నింగ్ ఇవ్వడం.. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఇప్పుడు మరోసారి పోలీసులు, హైడ్రాను ఉద్దేశించి దానం చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఉండి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఉంటూ ఆయన నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు చేపట్టిన కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఖైరతాబాద్‌లో అక్రమనిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తుండగా దానం అడ్డుకుని హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అధికారులకు మాస్ వార్నింగ్ ఇవ్వడం.. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఇప్పుడు మరోసారి పోలీసులు, హైడ్రాను ఉద్దేశించి దానం చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
దానం వ్యాఖ్యలు ఇవీ..
‘‘నేను పోలీసులతో, హైడ్రా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్‌కు చెప్పిన. పేదల ఇండ్లను కూలుస్తాం అంటే ఊరుకోను. అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్ కాను. నా ఇంట్లో వైఎస్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా రాలేదు’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సొంత పార్టీలో పెను సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చింతల్ బస్తీ కూల్చివేతలకు సంబంధించి దానం వ్యవహారతీరును పరిశీలిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ తెలిపారు. తాజాగా మరోసారి అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డి ఫోటో విషయంలో ఆయన తీరుపై కాంగ్రెస్ పెద్దల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా.. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ఇటీవలకాలంలో చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే.. అధికారులపై విరుచుకుపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి ఇక్కడికి బతకాడానికి వచ్చి.. ఇక్కడే ఉన్న మమ్మల్ని బతకనివ్వరా అంటూ ప్రశ్నించారు. వెంటనే కూల్చివేతలను నిలిపివేయాలంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కానీ దానం చేసిన మాస్ వార్నింగ్ సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి...
Producer Dil Raju: కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు దిల్‌రాజు
కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు
Read Latest Telangana News And Telugu News