Seethakka: రాహుల్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క ఫైర్
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:34 PM
Seethakka: కేంద్రమంత్రి బండిసంజయ్‌పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై బండి వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ విజన్ ఉన్న నాయకుడని తెలిపారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని స్పష్టం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా బీసీ కులగణన కోసం పట్టుబడుతున్నారన్నారు.
కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ విజన్ ఉన్న నాయకుడని తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. విద్వేష, విధ్వంసమే బీజేపీ విధానమని వ్యాఖ్యలు చేశారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని చెప్పారు.
భారత ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం.. స్పందించిన ప్రధాని సలహాదారు
బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో.. కాంగ్రెస్ శాంతి, సమానత్వం, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కుల గణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ మతంపై చర్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నేతల నైజమని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పదవుల కోసం పాకులాడే మనిషి కాదన్నారు. త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం రాహుల్ పోరాటం చేస్తున్నారని వెల్లడించారు.
అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ పనిచేయటం లేదని తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతోందన్నారు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే ఈరోజు దేశాన్ని నిలబెడుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారన్నారు. అణగారిన వర్గాలు, పేద ప్రజలంటే బీజేపీకి పట్టదని.. ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హాస్టల్ బాత్రూంలో గుర్తుతెలియని వ్యక్తులు.. విద్యార్థినిల ఆందోళన
రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. పరిస్థితి ఎలా ఉందంటే..
Read Latest Telangana News And Telugu News