Election Notification: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:44 PM
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.

నల్గొండ, ఫిబ్రవరి 3: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ (Teachers MLC Election Notification) విడుదలైంది. నల్గొండ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలు ఉండటంతో ఈనెల 11న నామినేషన్ల పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణనకు చివరి గడువు.
ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఇలాత్రిపాటి తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో 24,905 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రానికి నిధులే లక్ష్యం.. కేంద్రంలో కీలక వ్యక్తితో చంద్రబాబు భేటీ
అటు ఏపీలో కూడా గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నోటీఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా..10 తేది వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 11 తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అలాగే 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అనంతరం ఈనె 27న తేదీన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్జరుగనుంది. మార్చి 3న కౌంటింగ్ జరుగనుంది. గ్ర్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాను కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వైసీపీ ఉండనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పదవి కాలం మార్చి 27తో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికకు నోటీఫికేషన్ విడుదలైంది.