Share News

TG News: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: ప్రభుత్వ విప్ డిమాండ్..

ABN , Publish Date - Jan 15 , 2025 | 03:08 PM

తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు చెంపపెట్టని ఆయన ఎద్దేవా చేశారు.

TG News: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే: ప్రభుత్వ విప్ డిమాండ్..
Telangana govt whip Adi Srinivas

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు చెంపపెట్టని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న కేటీఆర్.. కుంభకోణం లేదు లంబకోణం లేదని అన్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ తేల్చి చెప్పారు. ఇందుకు కోర్టులూ ప్రభుత్వానికి సహకరించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా ఇళ్ల తలుపులు విరగొట్టి మరీ అరెస్టులు చేయడం లేదని ఆయన విమర్శించారు.


తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కేటీఆర్ చెప్తున్నారని, ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం తీర్పుపై తెలంగాణ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారని, అందుకు న్యాయస్థానం నిరాకరించిందని శ్రీనివాస్ గుర్తు చేశారు. దీనిపై ఆయన ఉన్నత న్యాయస్థానానికి వెళ్లినా సుప్రీంకోర్టు తన తీర్పుతో కేటీఆర్‌కు చెంపదెబ్బ కొట్టినట్లయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. ఏసీబీ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో న్యాయం ఉందని అందుకే కోర్టులు కేటీఆర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని శ్రీనివాస్ చెప్పారు.


ఈ కేసుల్లో కేటీఆర్ ఇప్పటివరకూ చేసిన హంగామాకు, చేస్తున్న దానికి సైతం బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగా, ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ

Supreme Court: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు

Updated Date - Jan 15 , 2025 | 03:10 PM