SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత
ABN , Publish Date - Mar 09 , 2025 | 10:17 PM
SLBC Tunnel : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి గురు ప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన సంఘటనలో 16 రోజుల నిరీక్షణ తరువాత ఓ మృతదేహం లభించడం అత్యంత బాధాకరమన్నారు.
నాగర్ కర్నూలు, మార్చి 09: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఆ క్రమంలో ఆదివారం ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటన చోటు చేసుకున్న దాదాపు 16 రోజుల అనంతరం వెలికి తీసిన మృతదేహాం గురు ప్రీత్ సింగ్‌గా ఎస్ఎల్‌బీసీ సిబ్బంది గుర్తించారు. టీబీఎమ్ ఆపరేటర్‌గా అతడు పని చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్లను అతడి కుటుంబ సభ్యులు గుర్తించనున్నారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అలాగే మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. మరోవైపు మరిన్ని మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.
Also Read: లాస్ట్ మినిట్.. జాక్ పాట్
స్పందించిన కేటీఆర్..
ఇంకోవైపు ఈ గురు ప్రీత్ సింగ్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన సంఘటనలో 16 రోజుల నిరీక్షణ తరువాత ఓ మృతదేహం లభించడం అత్యంత బాధాకరమన్నారు. వెలికితీసిన మృతదేహం మిషన్ ఆపరేటర్, పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్‌కు చెందినదిగా అంచనా వేసిన నేపథ్యంలో.. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ముఖ్యమంత్రి వైఫల్యం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిన నేపథ్యంలో చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి పరిహారం అందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న బాధితులను ప్రాణాలతో కాపాడాలని అందరూ ప్రార్థించినా, చివరికి కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఇన్ని రోజులకు విషాద వార్తను వినాల్సి రావడం దురదృష్ణకరమని పేర్కొన్నారు.
Also Read: వీడిన ఉత్కంఠత.. అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి అమాయక కార్మికులను బలి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి రెస్క్యూ ఆపరేషన్‌లో కూడా దారుణంగా విఫలం కావడం వల్లే ఇన్నాళ్లైనా ఇతరుల ఆచూకీ కనుగొన లేకపోయిందంటూ మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం, సర్కారు అంతులేని నిర్లక్ష్యం, సహాయక బృందాల మధ్య సమన్వయ లోపం వల్ల బాధిత కుటుంబాలు అంతు లేని వేదన అనుభవిస్తున్నాయన్నారు.
Also Read : బీజేపీని వరించిన అదృష్టం.. టీడీపీలో ఆ నలుగురిని కాదని..
కాళేశ్వరం ప్రాజెక్టలో భాగంగా 203 కిలోమీటర్ల టన్నెల్ పనులు కేవలం మూడున్నరేళ్లలో చేపట్టినా, ఇంతటి పెను ప్రమాదం ఏనాడు జరగలేదని ఆయన వివరించారు. కేవలం పది సెంటీమీటర్ల టన్నెల్ పనులు కూడా సరిగా చేయలేని సీఎం రేవంత్ రెడ్డి అమాయకులను బలిచేసిన పాపానికి క్షమాపణ చెప్పాలన్నారు. మిగతా వారి ఆచూకీనైనా సాధ్యమైనంత త్వరగా కనుగొని బాధితుల కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని తెలుగు వాార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
Also Read : ఈ సమయంలో చైన్ లాగితే.. రైలు ప్రయాణంలో జరిమానా విధించరు.. ఎందుకో తెలుసా?
For Telangana News And Telugu News