Bhadradri Ramayya: భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాల పంపిణీ..
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:56 PM
Bhadradri Ramayya: టీజీఎస్‌ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..

Bhadradri Ramayya Talambraalu: భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించాలి.. వారి పెళ్లి తలంబ్రాలను తీసుకోవాలని కోరుకుంటారు భక్తులు. మనసులో కోరిక ఉన్నా అందరికీ వెళ్లేందుకు వీలుపడదు. అలాంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో కలిసి భక్తులకు రామయ్య తలంబ్రాలను నేరుగా వారి ఇంటికే చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి, రామయ్య పెళ్లి తలాంబ్రాలు నేరుగా హోం డెలివరీ కావాలంటే..
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ఆవిష్కరించి తలంబ్రాల బుకింగ్ ప్రారంభించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవరం పూర్తయిన తర్వాత బుకింగ్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలు హోం డెలివరీ చేస్తారు. రాములోరి తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలు లేదా సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in ఓపెన్ చేసి రూ.151 చెల్లించి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోండి. భక్తులు సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిన అయినా నేరుగా ఆర్డర్ చేయవచ్చు. భక్తులు తలంబ్రాల సేవ పొందాలనుకుంటే టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040-69440000, 040-69440069లను సంప్రదించండి.
Read Also : KTR on Budget 2025: తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి: కేటీఆర్..
Telangana Budget 2025: ఇదీ తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే..
Telangana Budget 2025-26: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి