Share News

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 01 , 2025 | 07:44 AM

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వరంగల్: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ఆలయాలకు (Temples) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ భద్రకాళీ ఆలయం, వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే భద్రాద్రి రామాలయంలో ఈరోజు స్వామి వారు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా దశావతారాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. అలాగే హిమాయత్ నగర్ ఆలయంలో తెల్లవారు జామున 4 నుంచి శ్రీవారి సేవలు, వీఐపీ, సర్వ దర్శనలు ఉంటాయని ఏఈఓ రమేశ్​తెలిపారు. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఉదయం 7 నుంచి దర్శనాలు, సేవలు మొదలవుతాయని తెలిపారు. ఈ రెండు చోట్ల తిరుపతి లడ్డూ విక్రయాలు ఉంటాయన్నారు.


నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం కాణిపాక ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికీ స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం, అనంతరం మూల విరాట్‌కు చందనాలంకారం నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నట్లు వివరించారు. బుధవారం వేకువ జామున 3 గంటలకే స్వామి దర్శనాన్ని ప్రారంభించామని ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.150 దర్శన కూలైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల కోసం 8 వేల పెద్దలడ్డూలు, 80 వేల చిన్న లడ్డూలు సిద్ధం చేశామన్నారు. ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేయడానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్లు ఈవో పెంచలకిషోర్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనాన్ని కదిలించిన నినాదాలు

ఇదీ అసలైన గేమ్‌ ఛేంజర్‌ఇదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 01 , 2025 | 08:31 AM