Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:30 PM
Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

హనుమకొండ : కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని చెప్పారు. ఇవాళ(మంగళవారం) హనుమకొండలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్లో మంత్రులు పాల్గొన్నారు. దేవాదుల ఫేస్-3 పంప్‌హౌస్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించడానికి వచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని తెలిపారు. కమీషన్ల కోసం,శిలా ఫలకాల కోసమే కొత్త ప్రాజెక్టులు తెచ్చారు.. దేవాదులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుకున్న దానికంటే రైతులు ఎక్కువ సాగుచేశారని తెలిపారు. రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలకంటే రైతుల సమస్యలే ముఖ్యమని వచ్చామన్నారు. ఎంత పొద్దుపోయినా పంపు ఆన్ చేసి వెళ్తామని అన్నారు. నాటి ప్రభుత్వం దేవాదుల పూర్తి చేసి ఉంటే రైతులకు ఈ స్థితి వచ్చేది కాదని తెలిపారు. అంచనా వ్యయం పెరగడానికి కూడా కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్న కారణంగా ఇవాళే దేవాదుల పంప్ హౌస్ ప్రారంభించడానికి వచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేవాదుల ఫేస్-3 పంప్‌హౌస్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూజలు మాత్రమే చేశారు. సాంకేతిక కారణాలతో పంపు ఆన్ చేయలేక పోయామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాత్రి పొద్దుపోయాకనైనా పంపు ఆన్ చేస్తామని తెలిపారు. ఎంత రాత్రయినా వరంగల్‌లోనే ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని చెప్పారు. పంటలు ఎండిపోకుండా ఉండేందుకే వెంటనే ఫేజ్-3లో పంపులు స్విచ్ఛాన్ చేయడానికి వచ్చామని అన్నారు. పంటలకు ఇబ్బంది ఉన్న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలకు ఒక పంపుతో నీరందింస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాం...కానీ సాంకేతిక కారణాలతో పంపు ఆన్ చేయలేక పోయాం...ఎంత ఆలస్యమైనా ఆన్ చేసి వెళ్తామని తెలిపారు. 18నెలల్లో దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
ఈ వార్తలు కూడా చదవండి
BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్‌పై కవిత ప్రశ్నల వర్షం
Dana Nagender serious statement: నేను సీనియర్‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest Telangana News And Telugu News