Minister Seethakka: మంత్రి సీతక్క భావోద్వేగం.. అసలు కారణమిదే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 06:53 PM
Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.

మహబూబాబాద్ : మంత్రి సీతక్క (Minister Seethakka) భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త, ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు కుంజా రాము 20వ వర్థంతి సభ ఇవాళ(గురువారం) జరిగింది. ఈ సభలో సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. అరుణోదయ విమలక్కను హత్తుక్కుని మంత్రి సీతక్క కంటతడి పెట్టుకున్నారు. కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సీతక్క కంటతడి పెట్టడంతో మంత్రి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఓదార్చారు. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమని అన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..
CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్
Read Latest Telangana News and Telugu News