Home » Andhra Pradesh » Ananthapuram
క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. అరవిందనగర్లోని సీయ్సఐ హోలి ట్రినిటి చర్చిలో సోమవారం రాత్రి జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ప్రీక్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
ఓ అపార్ట్మెంట్ వారి నిర్వాకం వల్ల దాని చుట్టు పక్కల నివశించే వారు ఆర్నెల్లుగా మురు గునీటితో సహజీవనం చేస్తున్నారు. మండలంలోని పాపంపేట పంచాయతీ గణే్షనగర్లో ఈ పరిస్థితి కనిసిస్తుంది. అక్కడ ఓ అపార్ట్మెంట్ నిర్వాహకులు డ్రైనేజీ కాలువపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ర్యాంప్ దెబ్బతిని కాలువలోకి కుదువబడిపోయింది. ఫలితంగా మురుగు నీరు ముందుకు సాగేందుకు వీ లు లేకుండా పోయింది.
గార్మెంట్స్ రంగ పురోభివృద్ధికి ఎగుమతుల్లో వేగం పెరిగేలా రాయదుర్గం మీదుగా వెళుతున్న టాటానగర్, మైసూర్, వారణాసి, జైపూర్, యశ్వంతపూర్ రైళ్లను రాయదుర్గం స్టేషనలో ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు.
రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో బాలుర విభాగంలో నార్పల, బాలికల విభాగంలో అనంత స్పోర్ట్స్ అకాడమీ(ఏఎ్సఏ) జట్లు విజేతలుగా నిలిచాయి. జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో బాలుర-15, బాలికల అండర్-16 రూరల్ క్రికెట్ లీగ్ ఫైనల్స్ నిర్వహించారు.
నిత్యం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందికి క్రీడా పోటీలతో దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అన్నదాతలే ఆ గ్రామాలకు ఊపిరి అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏఎఫ్ ఎకాలజీ సెంటర్, రైతుసంఘాలు, సహాయ రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ఓ ప్రైవేట్హాల్లో జాతీయ రైతు దినోత్సవ సదస్సు నిర్వహించారు.
హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాల రాకతో తలుపుల ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. తలుపుల మండలంలోని కోరుగుట్టపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువలో నీరు వచ్చిన సందర్భంగా సోమవారం ఆయన జలహారతి ఇచ్చారు.
వైసీపీ చెత్త ప్రభుత్వం వల్ల వచ్చిన కష్టాలు తీరుతున్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని తుమ్మల గ్రామంలో మరమ్మతులు పూర్తయిన వర్మీకంపోస్టు యార్డును మంత్రి ప్రారంభించారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అఽధికారులను కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 246 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్ స్వీకరించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పర్సన ఇనచార్జ్ల పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 21వ తేదీతో పర్సన ఇనచార్జిల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం సాగింది.