Share News

VIP KALAVA: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:26 AM

గార్మెంట్స్‌ రంగ పురోభివృద్ధికి ఎగుమతుల్లో వేగం పెరిగేలా రాయదుర్గం మీదుగా వెళుతున్న టాటానగర్‌, మైసూర్‌, వారణాసి, జైపూర్‌, యశ్వంతపూర్‌ రైళ్లను రాయదుర్గం స్టేషనలో ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు.

VIP KALAVA: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలి
The petition is filed by the Whip

రాయదుర్గం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గార్మెంట్స్‌ రంగ పురోభివృద్ధికి ఎగుమతుల్లో వేగం పెరిగేలా రాయదుర్గం మీదుగా వెళుతున్న టాటానగర్‌, మైసూర్‌, వారణాసి, జైపూర్‌, యశ్వంతపూర్‌ రైళ్లను రాయదుర్గం స్టేషనలో ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు. ఆయన సోమవారం కర్ణాటకలోని తుంకూరులో క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలుగుదేశం పాలనలో తాను మంత్రిగా ఉన్నపుడు అనంతపురం, కణేకల్లు రహదారుల్లో రెండు రైల్వే వంతెనల పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అవి అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిలిచిపోయిన వంతెనలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాయదుర్గం నుంచి బళ్లారికి నిత్యం వాహన రాకపోకలు ఎక్కువగా ఉంటాయని చదం సమీపంలోని రైల్వేగేట్‌ వద్ద నూతన వంతెన నిర్మాణం అవసరముందన్నారు. అలాగే రాయదుర్గం-గుమ్మఘట్ట రహదారిలో పట్టణ శివారులో మరో వంతెనను నిర్మించాలని ఆయన మంత్రిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కాలవ తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 12:26 AM