Home » Andhra Pradesh » Ananthapuram
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆలయం పర్యవేక్షణ, సేవా సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు ఆలయ ఈఓ వాణికి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.
మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 8 వతరగతి విద్యార్థిని వం దన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు హెచఎం రవిప్రసాద్, పీఈటీలు హాలిమా, కృష్ణ తెలిపారు.
అపార్ ఐడీ నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం తగదని, వాటి కార్డుల జారీ కోసం ఆధార్ సవరణ కేంద్రాలను జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు డిమాండ్ చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం వారు ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆయన మహిళా సంఘాలు, డిజైనింగ్, మ్యాచింగ్సెంటర్, బ్యూటీపార్లర్, సిల్క్హౌస్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఏళ్ల తరబడి జైలుశిక్ష అను భవిస్తున్న ఖైదీలను రిప బ్లిక్ డే సందర్భంగా విడు దల చేయాలని సీపీఐ నాయకులు హోంమంత్రి అనితను కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నాయకులు మంగళవారం హోంమంత్రిని కలిశారు. వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా చాలా మంది ఖైదీలు సత్ప్ర వర్తనతో శిక్ష అనుభవిస్తున్నారన్నారు.
మండలంలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి రూ.రెండు లక్షలకు పైగా విలువైన బంగారం పులిగోరు హారాన్ని భక్తు లు మంగళవారం సమర్పించారు.
క్రీడారంగానికి మహర్దశ, క్రీడాకారులకు వరాలు కురిపించే క్రీడా పాలసీ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రీడాకారులు, కోచలు, క్రీడా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీకి మద్దతుగా మంగళవారం సాయంత్రం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.
గత వైసీపీ పాలనలో పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక పోవ డంతో గ్రామాలు వెలవెలబోయాయి. ఆ ఐదేళ్లలో తూతూ మంత్రంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి మమ అనిపించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పల్లెల రూపు రేఖలు మా రుతున్నాయి. గ్రామాల్లో సీ సీ రోడ్ల నిర్మాణానికి భారీ గా నిధులు మంజూరు చే యడంతో ఇప్పటికే పనులు చేస్తున్నారు.
Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్‌లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..
మండలంలోని మూడు చెరువుల సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దారు షర్మిల సోమవారం తెలిపారు.