Home » Andhra Pradesh » Ananthapuram
జిల్లాలోని అ న్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిం చాలని డిమాండ్చేస్తూ సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
మా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు ఎప్పుడిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులకు వన ఇండియా- వన అపార్ ఐడీ కోసం వారి తల్లిదండ్రుల అవస్థలు చెప్పనలవి కాదు. జనన ధ్రువీకరణ లేదా ఆధార్ కార్డు లేదా యూ-డైస్లో ఎక్కడ చిన్న అక్షరం తేడా ఉన్న అపార్ కార్డు జనరేట్ కాకాపోవడంతో తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు తెలుపుతున్నారు.
కార్తీకమాస మొదటి సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని అన్ని శివాల యాల్లో పూజలు జరిగాయి.
గత ఐదేళ్లలో గుంతల రోడ్లు చూసి ఏపీకి రావాలం టేనే ప్రజలు భయపడేవారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచా యతీ నుంచి తగరకుంట వెళ్లే మార్గంలో గుంతలు పడ్డ రోడ్లకు ‘మిషన పాత హోల్స్ ఫ్రీ’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపట్టారు.
కార్తీకమాసం తొలి సోమవారం ఆధ్యాత్మికశోభతో అనంత అలరారింది. శైవక్షేత్రాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. సాయంత్రం మహిళలు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి కార్తీ కదీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలో జిల్లా అంత టా కార్తీక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగింది.
జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అక్రమ డెప్యుటేషన్లపై అనేకమంది కొనసాగుతున్నారనే ఫిర్యాదులపై కడప ప్రాంతీయ వైద్యాధికారి(ఆర్జేడీ) రామగిడ్డయ్య విచారణ చేశారు.
డ్వాక్రా సంఘాల అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికతో ముందుకు సాగాలని డీఆర్డీఏ-వెలుగు పీడీ ఈశ్వరయ్య సూచించారు. డీఆర్డీఏ-వెలుగు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సోమవారం సమీక్ష నిర్వహించారు.
వివిధ సమస్యలపై ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టరు శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజాఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. బడికి సరిగా వెళ్లడం లేదు. చిన్నోడు ఏమైపోతాడో అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇంటర్ చదువుతున్న అన్నకు ఆవేదన కలిగింది. ‘జులాయిగా తిరిగితే పాడైపోతావురా..! బాగా చదువుకో.. బడికి వెళ్లు.. అమ్మానాన్న నీ గురించి ఎంతగా బాధపడుతున్నారో చూడు..’ అని చాలా చెప్పి చూశాడు.
జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.