Home » Andhra Pradesh » Chittoor
కొత్తగా నియమితులైన టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. చైర్మన్‌గా బీఆర్ నాయుడుతో పాటు 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి శనివారం నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.23,54,759 ఆదాయం లభించింది. ఆలయ ఈవో కార్యాలయ భవనం వద్ద బహినంగ వేలం, సీల్డ్, ఆన్లైన్ టెండర్లు నిర్వహించినట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు.
తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలను మంజూరు చేయాలని గుడిపాల మండలం నారగల్లు ఎస్టీకాలనీ వాసులు వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో జేసీ విద్యాధరికి అర్జీ సమర్పించారు.
జిల్లాలోని శివాలయాలన్నీ ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారాయి.కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయాల్లో దీపాలను వెలిగించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌ను బుధవారం రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనుంది. టెట్ ఫలితాలు సోమవారం వచ్చిన క్రమంలో డీఎస్సీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
Andhrapradesh: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సమయంలో అంబటి ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అంబటిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని
వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
కూటమి ప్రభుత్వం చెప్పినట్లే జీతాలు, పెన్షన్లు ఠంఛనుగా ఖాతాల్లో వేసి ఇచ్చిన హామీని అమలుచేసింది.
రోడ్డుప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లాలోని రహదారులను గుంతల రహితం చేయడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు.