Home » Andhra Pradesh » Guntur
నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి హాజరుకావడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి కూటమి నేతలు ఆహ్వానించకుండానే జోగి వచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇప్పటికే వివరణ ఇచ్చారు.
రాష్ట్ర టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితం అవుతున్నారన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్లలేకపోతున్నారని చెప్పారు.
Andhrapradesh: దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని.. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.
జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సీఆర్డీఏ-43వ సమావేశం జరిగినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగుల పనులకు సంబంధించి రూ.24,276 కోట్లకు ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.
తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.