Home » Andhra Pradesh » Guntur
గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది.
గుంటూరు జిల్లా తొండపి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగయ్య ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకున్నారు. అయితే ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో రోడ్డుపై పోయించారు. ఇదే విషయమై వైసీపీ కార్యకర్త సుధీర్ ప్రశ్నించాడు.
కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇంట్లో బాబాయ్‌ని చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ లో జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే అన్‌స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) టాక్ షో చిత్రీకరణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న (శనివారం) సాయంత్రం యువతిని కారులో తీసుకెళ్లాడు.
మంగళగిరిలో హరికృష్ణ, రామకృష్ణ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని సురేశ్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షగట్టిన నిందితులు అదును చూసి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు.
జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. వృద్ధుల వైద్య భీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పయ్యావుల సూచించారు. పేదలు.. మధ్య తరగతి ప్రజలకు వైద్య భీమాను చేరువ చేయాలని కేశవ్ కీలక సూచించారు.
లంచం అనే పదం వినిపించొద్దని... అలాంటి అధికారులు, వ్యక్తులు తన వద్ద ఉండొద్దని చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, రికమండేషన్ లేకుండా బదిలీలు చేశామని చెప్పారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి పారదర్శకతతో ఈ బదిలీలు జరిగాయని వివరించారు.