Home » Andhra Pradesh » Krishna
వందలు కాదు.. వేలు కాదు.. లక్షలు కూడా కాదు.. ఏకంగా రూ.కోటి 25 లక్షలకు సైబర్ మోసం డిజిటల్ అరెస్టులో చిక్కుకున్న ఓ మహిళ చివరికి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.
పూనూరు గౌతంరెడ్డి... కమ్యూనిస్టు నేతగా ఎదిగి వైసీపీలో ట్రేడ్ యూనియన్ నేతగా ఓ వెలుగు వెలిగాడు. గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్నం కేసులో ప్రస్తుతం పలాయనం చిత్తగించాడు. ఈ కేసులో ఏ1గా ఉన్న గౌతంరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
పోలీసు కమిషనరేట్ అధికారులు ఆపరేషన్ డ్రోన్ అమలు చేస్తున్నారు. ఒక డ్రోన్ 1,000 సీసీ కెమెరాలతో సమానమని భావిస్తున్నారు. బుడమేరు వరదల సమయంలో డ్రోన్లు ఇచ్చిన ఫలితాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మూడు అంశాల్లో డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్న అధికారులు వాటిని ఆపరేట్ చేయడానికి సిబ్బందిని కూడా సమాయత్తం చేస్తున్నారు.
Andhrapradesh: ఏపీఐఐసీ భూములు, ప్రభుత్వ భూముల్లో పార్క్‌లు అభివృద్ధి చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు స్థలాల్లో పార్క్‌లు అభివృద్ధి చేసిన చోట పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొస్తే వారికి కూడా పది శాతం అదనపు రాయితీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
Andhrapradesh: గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయి టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేశారని.. అతడిని అరెస్ట్ చేయాలని కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: ‘‘2019లో ఒక్కచాన్స్ అనేమాట చెప్పి అధికారంలోకి వచ్చారు.. నాకు నాలుగు అయిదు నెలలు పట్టింది. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కవ విధ్వంసం జరిగింది’’ అని చంద్రబాబు తెలిపారు. జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ అయిదు సంవత్సరాలు ఎక్కవ విధ్వంసం జరిగిందన్నారు.
Andhrapradesh: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటనపై బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. అనంతరం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. రెండు రోజుల పాటు ప్రచారంలో భాగంగా ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
Andhrapradesh: ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హూస్లకు అయినా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖా మంత్రులను కొరుతున్నానన్నారు. ‘‘ఈ విషయం సభలో చెప్పొద్దు బాగోదు అని మా వాళ్లు అన్నారు. అయితే ఇది చాలా ముఖ్యమైనది ఇబ్బంది పడే విషయం అందుకే చెప్పేశా’’ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి నారా లోకేష్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి మాట్లాడారు. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
Andhrapradesh: వైసీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేనిపై 27 అక్రమ కేసులు నమోదు అవగా.. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. తన కోడలి రాజకీయ జీవితంపైనా పల్లె రఘునాథ్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.