Posani: పోసానికి బిగుస్తోన్న ఉచ్చు.. ఏక్షణమైనా అరెస్ట్
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:32 PM
Andhrapradesh: గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయి టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేశారని.. అతడిని అరెస్ట్ చేయాలని కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అల్లూరి జిల్లా, నవంబర్ 15: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నాయకులు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై (YSRCP Leader Posani Murali Krishna) వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పాడేరు పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఉచ్చు బిగుస్తోంది. పోసానిని అరెస్ట్ చేయాలంటూ పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయి టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేశారని.. అతడిని అరెస్ట్ చేయాలని కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరోజే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసులు నమోదు అయ్యాయి.
టీడీపీ, జనసేన నేతలు పోసాని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వీటిలో ఐదుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అసభ్యకరంగా దూషించారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు.
AP Assembly: బడ్జెట్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర చర్చ
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసినందు గాను పోసానిపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నేతలు టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎ.విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అటు విజనగరంలోనూ పోసానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. కూటమి నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ విజయనగరం ప్రధాన కార్యదర్శి ఐపీవీ రాజు ఆధ్యర్యంలో టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఐటీ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్‌పై పోసాని కృష్ట మురళి అసత్య ఆరోపణలు, పరుస పదజాలంతో మాట్లాడారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేసి వారి గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజాం పోలీస్‌స్టేషన్‌లోనూ పోసానిపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News