AP Assembly: బడ్జెట్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర చర్చ
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:53 PM
Andhrapradesh: ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హూస్‌లకు అయినా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖా మంత్రులను కొరుతున్నానన్నారు. ‘‘ఈ విషయం సభలో చెప్పొద్దు బాగోదు అని మా వాళ్లు అన్నారు. అయితే ఇది చాలా ముఖ్యమైనది ఇబ్బంది పడే విషయం అందుకే చెప్పేశా’’ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
అమరావతి, నవంబర్ 15: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (MLA Vishnukumar Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టంలో ఇంట్లో ఆరు మద్యం బాటిళ్లు మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఉందని.. గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడని పెట్టుకోలేదన్నారు. మంచి మద్యం అక్కడా ఇక్కడా తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్ళు పెట్టుకొని మిగలినవి దాచిపెట్టమని ప్రెండ్స్‌కు ఇచ్చేవాళ్లమని.. అయితే వారు తమకు గిప్ట్‌గా ఇచ్చారనుకొని ఖాళీ చేసేసే వారన్నారు.
Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్
ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హూస్‌లకు అయినా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖా మంత్రులను కొరుతున్నానన్నారు. ‘‘ఈ విషయం సభలో చెప్పొద్దు బాగోదు అని మా వాళ్లు అన్నారు. అయితే ఇది చాలా ముఖ్యమైనది ఇబ్బంది పడే విషయం అందుకే చెప్పేశా’’ అని అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్లు నుంచి వచ్చే ఆదాయం రూ.4000 కోట్లు పెంచి చూపించారు అది ఎలా వస్తుందని ప్రశ్నించారు. రూ.25,595 కోట్లు ఎక్సైజ్ ద్వారా వస్తుందని మంత్రి కూడా చెప్పారన్నారు. అయితే గత పభుత్వనికి కూడా ఇంత వచ్చి ఉంటుందనే అనుమానం ఉందన్నారు. అంటే కనీసం రూ.10 వేల కోట్లు ప్రతి ఏడు వాళ్లు కొట్టేశారని మండిపడ్డారు. తమ లెక్కల ప్రకారం లిక్కర్‌లోనే వైసీపీ రూ.30 వేల కోట్లు కొట్టేసిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
కాగా..మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. 62 శాతం మంది రైతు బిడ్డల కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించారన్నారు. గత అయిదేళ్లుగా వ్యవసాయ శాఖను పూర్తిగా మూత వేసేశారన్నారు. రీసర్వే కావాలని ఎవ్వరు అడిగారు.. ప్రతి రైతుపై భారం వేశారన్నారు. పాస్ బుక్‌లు, రాళ్లపై ఫోటోలు పేర్లు ఏంటి అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఎంతో దుర్మార్గమైనదన్నారు. అసెంబ్లీకి 11 మంది ఎందుకు రారని ప్రశ్నిస్తున్నామన్నారు. రాను అని ఎమ్మెల్యేలు చెప్పాక కూడా వారిని ఇక్కవ ఉంచాలా అని ప్రశ్నిస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.
Hyderabad: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. రాకపోకలు ప్రారంభం
బడ్జెట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్..
వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో రూ.1450 కోట్లు గ్రామాలకు అందించామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. చివరకు చిన్న పిల్లల చిక్కీల బకాయిలు రూ.175 కోట్లు పెట్టి వెళ్లారన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కేటాయించామని తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని తెలిపారు. అమరావతికి ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పా గ్రాంటా అనేది కేంద్రమే చెపుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్లారంటే వారి వ్యక్తిగత కేసుల కోసమే అని విమర్శించారు. రైల్వేజోన్ కు త్వరలోనే భూమి పూజ చేయిస్తామని వెల్లడించారు. 55 వేల కోట్ల జాతీయ రహదారిని రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. కేంద్రం డివెల్యూషన్‌లో రూ.5700 కోట్లు అధనంగా ఈసారి వచ్చిందన్నారు. ప్రతి ఢిల్లీ పర్యటన ఏదో ఒక లబ్దిని కలుగజేస్తోందని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహనతోపాటు స్కీనింగ్‌కు నిర్ణయం తీసుకున్నామన్నారు. దళిత విద్యార్దులకు నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News