Home » Andhra Pradesh » Nellore
ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల్లూరులోనూ పార్టీ కార్యాలయం పేరిట జగన్ ఒక రాజప్రసాదాన్ని నిర్మించారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో గతంలో పేదల టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని జగన్ పార్టీ స్వాహా చేసింది.
వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి(YSRCP former MP Adala Prabhakar Reddy) వ్యాపార భాగస్వామి ప్రసాద్ చౌదరి(Prasad Chaudhary)పై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం నెల్లూరులో సంచలనంగా మారింది. ప్రసాద్ చౌదరిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి నడిరోడ్డు పైకి తరిమి మరీ దాడి చేయడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బర్మాసెల్ గుంట (Barmasel Gunta) వద్ద పూరిళ్లల్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకొని నాగలక్ష్మి (Nagalakshmi) అనే బాలిక మృతిచెందినట్లు తెలుస్తోంది.
నెల్లూరు: జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనం రేపింది. మర్రిపాడు మండలం, కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. కదిరినాయుడిపల్లి వద్ద ముంబాయి- నెల్లూరు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలపై పెద్దపులి దాడి చేసింది.
కావలి(Kavali)లో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. వైసీపీ(YSRCP) హయాంలో జిల్లావ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు(Illegal Layout) భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, వారి అనుచరులు వదిలిపెట్టలేదు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్య నేతలంతా అండర్ గ్రౌండ్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar) రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఉమ్మడి నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లకూరు మండలం, చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై వైసీపీ నాయకులు కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారన్న కోపంతో వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో అర్ధరాత్రి దాడి చేయించారు.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో బంగారాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో చాకచక్యంగా నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు.