Home » Andhra Pradesh
కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే బిల్లులు చెల్లించింది. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెం కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్(23) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
:ఆవుపాల ధరను పెంచాలని కొత్తవలస-అరకు రోడ్డులోని నిమ్మలపాలెం జంక్షన్ దగ్గర శనివారం ఆవుపాల ఉత్పత్తిదారులు రాస్తారోకో నిర్వహించారు.
జిల్లా గృహనిర్మాణ శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. నెల రోజుల క్రితం జిల్లాలో జరిగిన వర్క్ ఇనస్పెక్టర్లు, కంప్యూటర్ అపరేటర్ల బదిలీలు ఆ శాఖ ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించాయి.
జర్మనీ దేశంలో ఉద్యోగావకాశాల కోసం నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూరా పర్సనల్ భాగస్వామ్యంతో జర్మనీలో పనిచేయాలనుకునే నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాష నేర్పించడంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, డిప్యూటీ కలెక్టర్ నూకరాజు సూచించారు. శనివారం భోగాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ఎం.సురేష్, ఆర్ఐ ఇమ్రాన్ పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మెడకు ఉరితాడు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ ఎదుట వారు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది.
తమ భూమిని మరోసారి రీసర్వే చేసి అడంగల్‌లో ఎక్కించమని గ్రామ సచివాలయ ఉద్యోగులను అడిగితే లంచం ఇస్తే పని చేస్తామని చెబుతున్నారని తమకు న్యాయం చేయాలని తిప్పనూరు గ్రామ రైతులు మాదన్న, నల్లన్న, అయ్యస్వామి, మధు, కళ్యాణి. కన్నయ్య కోరారు.
మండలంలోని పలు గ్రా మాల్లో శతశాతం ఆరుబయట బహిరంగ మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యం అటకెక్కుతోంది. ప్రధానంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహ న లేకపోవడంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో కొందరు సామగ్రి నిల్వచేసు కోవడానికి వినియోగిస్తున్నారు.
భక్తి మార్గమే ప్రతి ఒక్కరి జీవన మార్గం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం కంచరవీధి బాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.