Home » Andhra Pradesh » Prakasam
గ్రానైట్ గనుల్లో భద్రత డొల్లగా మారింది. గనుల యజమానుల ధనదాహం, మైన్స్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వెరసి పొట్టచేతపట్టుకొని వచ్చిన వలస కార్మికులకు ప్రాణసంకమవుతోంది. 2010లో హంసా క్వారీలో హైవాల్ విరిగిపడి 14మంది మృత్యువాత పడిన ఘటన దేశవ్యాపం్తగా సంచలనమైంది.
రెండు కీలక శాఖలలో పనిచేసిన ఇద్దరు జిల్లా అదికారుల అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. విచారణ కోసం కలెక్టర్ నియమించిన అధికారులు ఈమేరకు ఆమెకు నివేదించారు. దీంతో వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా లేఖలు రాశారు.
జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుకు ఉపకరించే కీలక పథకాలు, ప్రాజెక్టులపై ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి కరువైంది. పారిశ్రామిక రంగం పడకేసింది. విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఉదాసీనత కన్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయంతో నడిపించడంతోపాటు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మధ్య వారధిలా పనిచేయాల్సిన నాటి ఇన్చార్జి మంత్రులు నామమాత్రంగా మిగిలారు.
ప్రజల కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలసి హాజరయ్యారు.
శ్రీరామ నవమి స్వామివారి కల్యాణ మహోత్సవంలో కోటి తలంబ్రాలు సమకూర్చే క్రమంలో భాగంగా రామ భక్తులు ఆదివారం గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు వడ్లును ప్రత్యేక పూజలతో సన్నద్ధం చేశారు.
చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆ విషయం బహిరంగ రహస్యం. అయితే సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు. అక్రమార్కులపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఒకరిని చూచి మరొకరు ఇసుక దందాను కాసులు సంపాదించే వనరుగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైన నేపథ్యంలో స్థానికంగా నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జన సేన, బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరశింహస్వామి దేవాలయాలతో పాటు పలు దేవాలయాల ట్రస్ట్‌బోర్డులు, అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు, సభ్యులతోపాటు పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
మార్కాపురం పట్టణంలో కార్తీక మాసం పూజలు శనివారం నుంచి భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ పాట్ హోల్‌ఫ్రీ (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్) కార్యక్రమం శనివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధి మద్దులూరు గ్రామంలోని ఆర్అండ్బీ రహదారికి రూ.20లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌తో కలిసి కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కదలిక మొదలైంది. అవినీతి, అక్రమాలపై విచారణ సమయంలో సహకార శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ‘అక్కడంతే’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఆయా వర్గాల్లో కలకలం రేపింది. సహకార అధికారులు కలవరపాటుకు గురయ్యారు.