Home » Andhra Pradesh » Prakasam
ఎట్ల కేలకు రోడ్లు బాగుపడుతున్నాయి. గుం తల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. శనివారం ఆర్అండ్బీ డీఈ ఎం.నళిని ఎక్స్‌కవేటర్‌కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు నాయకులు, ఆర్అండ్బీ అధికారులు గంజిపాలెం నుంచి రామాపురం వరకు రోడ్డు మ రమ్మతు పనులు ప్రారంభించారు.
సహకార శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్ లేఖ రాసినా అక్కడి నుంచి స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత సీఈవో కోటిరెడ్డిని సరెండర్ చేయాలని సూచిస్తూ పదిరోజుల క్రితం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
ఒకవైపు పింఛన్ల పంపిణీ, మరోవైపు ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా కోలాహలంగా సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచే ఊరూవాడా పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా మధ్యాహ్నం తర్వాత ఉచిత సిలిండర్ల అందజేత కార్యక్రమాలను నిర్వహించారు.
‘అక్కడ అవినీతి వ్యవహారాలు జోరుగా సాగాయి. డబ్బులు ఇస్తేనే బిల్లులు ఓకే చేశారు. లేదంటే నెలలతరబడి పెండింగ్‌లో పెట్టారు. కార్యాలయాన్ని తక్షణం ప్రక్షాళన చేయాల్సిందే..’ ఇది విచారణాధికారి నివేదిక. తదనుగుణంగా స్పందించిన కలెక్టర్, ఉన్నతాధికారులు.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తూ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు శుక్రవారం ఉత్వర్వులు జారీచేశారు. గత కొద్దిరోజులుగా ఆర్ఐల నియామకంపై సందిగ్ధం నెలకొనగా ఎట్టకేలకు తెరపడింది. కాగా గతంలో ఇద్దరు ఆర్వోలు, ఎనిమిది మంది ఆర్ఐలు ఉండగా.. ప్రస్తుతం ఒక ఆర్వో, నలుగురు ఆర్ఐలకు మాత్రమే పరిమితం చేశారు.
జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్లు, సైడు కాలువల పనులను డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
ఒంగోలులో కేబుల్ ఆపరేటర్‌పై దౌర్జన్యం చేసి అతని వద్ద బలవతంగా సంతకాలు తీసుకొని వాటాలు పంచుకున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి వద్ద ఉన్న ద్వితీయశ్రేణి నాయకుల ని ర్వాహకం ఇదీ.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒ క్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘి క సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీ రాంజనేయస్వామి అన్నారు. పింఛన్ల పెంపుపై మాటతప్పి వృద్ధులను కూడా మోసం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజ మెత్తారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి వస్త్ర వ్యాపారులు పాలాభిషేకం చేశారు.