Home » Andhra Pradesh » Visakhapatnam
మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని విద్యార్థులకు ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలను తెలియజేయడానికి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయి అండర్-19 హాకీ పోటీలకు ఎంపికైన రాష్ట్రస్థాయి జట్టులో స్థానం పొందారు.
మండలంలోని దిగుడుపుట్టు కూడలి వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు 135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.
పూడిమడక హార్బర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పరిశీలించారు. తొలుత పూడిమడక - లోవపాలెం ప్రధాన రహదారి నుంచి హార్బర్ ప్రాంతం వరకు వేసిన రోడ్డుతోపాటు తీరంలో నిర్మాణంలో వున్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను ఆమె సందర్శించారు.
అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు.
పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడకు రానుండడంతో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రధాన రహదారి మరమ్మతులకు ఏపీఐఐసీ అధికారులు నడుం బిగించారు.
నర్సీపట్నం మునిసిపాలిటీలోని కొత్తవీధిలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు.
దాదాపు పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు కృషితో మంజూరైన ఎన్టీపీపీ పవర్ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలు ఎక్కనున్నది.
మండలంలో భవన నిర్మాణాలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది.
గత వైసీపీ ప్రభుత్వం వలంటీరు వ్యవస్థను అడ్డంపెట్టుకుని పలుచోట్ల వైసీపీకి అనుకూలంగా వున్న వారికే సంక్షేమ పథకాలు అందించింది.