Home » Crime
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తిని హత్యచేసి నదిలో పడేశారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.
భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 7: మానసికస్థితి సరిగా లేని ఓ తల్లి కుమారుడిని చంపి, తానూ ఆత్యహత్య చేసుకుంది. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
బ్యాంకు అధికారులుగా చలామణి అవుతూ తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులు, వ్యాపారులను మోసం చేస్తోన్న ఏడుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయ గ్రామంలోని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.
ఉత్తరాది ముఠాతో కలిసి నకిలీ మొబైల్ యాప్ సంస్థ నెలకొల్పి వేలాదిమందిని మోసగించిన కేసులో చెన్నై వాషర్‌మెన్‌పేట(Chennai Washermenpet)కు చెందిన శివరామ్ జయరామన్ (30)ను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన వ్యక్తి ఓ బంగారం దుకాణంలో పనిలో చేరాడు. నాలుగు రోజులకే దుకాణ యజమానికి టోకరా వేసి రూ. 30లక్షలతో ఉఢాయించాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులుTask Force Police) ఇద్దరు నిందితుల ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రలో షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో రంగంలోకి దిగి మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించారు. డీసీపీ కవిత పర్యవేక్షణలో షీటీమ్స్ ఆధ్వర్యంలో సిటీ కమిషనరేట్(City Commissionerate) పరిధిలో 12 బృందాలతో పాటు, ప్రతి పీఎస్ నుంచి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది చొప్పున సుమారు 200 మంది పోలీసులు పహారా కాశారు.
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
గూగుల్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్‌పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్లైన్ గూగుల్ రేటింగ్ టాస్క్‌లో చేరింది.